తనకు ఐటెం సాంగ్స్ చేయడమే బాగా ఇష్టమట.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన శృతిహాసన్!

ఈ ఆధునిక కాలంలో చాలామంది హీరోయిన్లు ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేస్తూ డబ్బులను విపరీతంగా సంపాదిస్తున్నారు. అయితే అదే విధంగా సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా రకరకాలైన పాత్రల్లో నటించి హీరోయిన్లు సంపాదించే కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు. అయితే ఇదే తరహాలో శృతిహాసన్ కూడా వచ్చి చేరింది అనే చెప్పాలి.

ప్రముఖ స్టార్ నటుడు అయినా కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. ఈమె కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తుంటుంది. ఆమెకు యూత్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్ట్‌లు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను కూడా సంకోచం లేకుండా బయటికి చెప్తుంది. మొదట్లో ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలు కూడా చేసింది. ఆ తర్వాత  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లక్ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఘోర పరాజయం పాలయ్యింది. దీంతో శృతి హాసన్ పై ఎంతోమంది ఎన్నో విమర్శలు కూడా చేయడం జరిగింది.

అయితే ఆ తర్వాత సిద్ధార్థ్ సరసన ఒక సినిమాను చేసింది. ఆ సినిమా కూడా పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత ఆమెకు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. దీంతో శృతిపై ఉన్న విమర్శలు కూడా తొలగిపోయాయి. అయితే ఆ తర్వాత ఆమెకు అప్పటినుంచి చాలా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అందులో కూడా కొన్ని సినిమాలు పరాజయాల పాలవ్వడంతో కొన్ని రోజులు ఆమె ఇండస్ట్రీకు దూరంగా ఉంది. అయితే క్రాక్ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది.

ఇక ఇటీవల ఆమె ఓ సందర్భంలో.. నిర్భయంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అయితే ఆమెకు సినిమాల్లో హీరోయిన్ లా నటించే కన్నా.. సినిమాల్లో ఐటమ్ గర్ల్ లాగా నటించడమే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఈ సినిమాల్లో హీరోయిన్ లా ఎంతో కష్టపడి నటించి ఫ్లాప్ అయితే బాధపడి ఈ డిప్రెషన్ కన్నా ఓ రెండు మూడు సార్లు పొట్టి బట్టలు వేసుకొని హీరో పక్కన ఒకసారి డాన్స్ చేస్తే హీరోయిన్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఎంతో నిర్భయంగా.. స్ట్రైట్ ఫార్వర్డ్ గా.. శృతిహాసన్ చెప్పుకొచ్చింది.

శృతిహాసన్ మహేష్ ఆగడు సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత ఆమెకు మరికొన్ని సినిమాలో ఐటంగర్ల్ గా అవకాశాలు రావడం జరిగింది. ఆ తరువాత ఆమెకు బాలీవుడ్ లో ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అందులో హీరో అర్జున్ కపూర్. దానితో పాటు ఆమె ఎన్నో ఐటెం సాంగ్స్ ను చేయడం జరిగింది.

ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో సలార్ సినిమాలో బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు బాలయ్యతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలలో కూడా ఆమె చేస్తున్నట్టు తెలిపింది.
ఇప్పుడు ఆమె ఇంకోసారి బిజీగా అయిపోయింది. ఇక ఆమె కూడా తన తండ్రిలానే కోట్లను సంపాదించబోతుంది.