రోజులుగా అన్వేషణ జరుగుతోంది. ఈ సినిమాకు ఓ రేంజ్ హీరోయిన్ కావాలన్నది బన్నీ కోరికగా తెలుస్తోంది. చివరకు దిల్ రాజు – వేణు కొంతమంది హీరోయిన్ల పేర్లు సూచించినా బన్నీకి మాత్రం నచ్చలేదు.బన్నీ మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియాభట్ కావాలని కోరినట్టు తెలుస్తోంది. వేణు శ్రీరామ్‌తో పాటు దిల్ రాజు ఆమెను అప్రోచ్ అయినా ఆమె మాత్రం నో చెప్పేసిందట. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె బన్నీ సినిమాలో చేసేందుకు ఒప్పుకోలేదట. ఆలియా ఇప్పటికే తెలుగులో మెగా హీరో రామ్ చరణ్ సరసన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.దీంతో బన్నీ కోసం మరో క్రేజీ హీరోయిన్ వేటలో వేణు ఉన్నాడట.
అంతెందుకు వైకుంఠపురం సినిమా కోసం కూడా చాలా రోజుల పాటు హీరోయిన్ల వేట కొనసాగించారు. చివరకు బన్నీతో డీజేలో జోడీ కట్టిన పూజతో సెట్ అయ్యారు. మరోసారి బన్నీ సినిమా కోసం హీరోయిన్ల వేట తప్పడం లేదు. సాహో రిజల్ట్ తర్వాత శ్రద్ధాకపూర్‌ను కూడా ట్రై చేయవచ్చని తెలుస్తోంది.