బిగ్ బాస్ వివాదాల వెనక బిగ్ గేమ్?
ఎన్నడూ లేనిది `బిగ్ బాస్` కొత్త సీజన్ వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా ఈ ఆదివారం నాడు బిగ్ బాస్ 3 ప్రారంభం కాబోతోంది. అయితే సరిగ్గా వారం ముందు ఈ షో నిర్వాహకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు అట్టుడికించాయి. గల్లీ నుంచి దిల్లీ వరకూ ఈ వివాదంపై ఆసక్తికర చర్చ సాగింది. మహిళా కమీషన్.. హ్యూమన్ రైట్స్.. పోలీస్ .. యాక్టివిస్ట్స్ అంటూ బోలెడంత హడావుడి జరిగింది. జర్నలిస్ట్ కం యాంకర్ శ్వేతారెడ్డి.. నటి గాయత్రి గుప్తా లాంటి వాళ్లు నిర్వాహకులు తమను లైంగికంగా వేధించారని ఆరోపించారు. తప్పుడు నియమాలతో కాంట్రాక్టులపై సంతకం చేయించుకున్నారని శ్వేతారెడ్డి ఆరోపించారు. అంతేకాదు ఆ ఇద్దరూ పోలీస్ గడప తొక్కి బిగ్ బాస్ పై కేసులు పెట్టారు. దిల్లీ గడప వరకూ వెళ్లారు. మహిళా కమీషన్ కి ఫిర్యాదు చేయడంతో పెద్ద రచ్చయ్యింది.
అసలు బిగ్ బాస్ వెనక ఏం జరుగుతోంది? ఇది ప్రారంభం అవుతుందా? అన్న సందిగ్ధతకు కారణమయ్యారు. వీళ్లకు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అనే లాయర్ కం నిర్మాత తోడై బిగ్ బాస్ 3 ని నిలిపేయాలంటే తెలంగాణ కోర్టుకు వెళ్లడంతో అసలేం జరుగుతోందోనన్న సందిగ్ధత నెలకొంది. అయితే బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్టు చేయొద్దంటూ కోర్లు వేసిన మెలికతో ఈ ఆదివారం (జూలై 21) బిగ్ బాస్ సీజన్ 3 వైభవంగా ప్రారంభమైపోతోందిట.
`బిగ్ బాస్ 3`పై కుట్ర చేశారా?
ఈ నేపథ్యంలో కోర్టు కేసులు.. గొడవలు ఏమైనట్టు? గల్లీ నుంచి దిల్లీ వరకూ వెళ్లి ఆపాలని చూశారు కదా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రత్యర్థులు షాడో రూపంలో ఆపాలని కుట్ర పన్నారా? అంటూ యువతరంలో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలు బిగ్ బాస్ 3పై ఫిర్యాదు చేసిన ఆ ఇద్దరూ ఎవరో ఇప్పటివరకూ ఎవరికీ పెద్దంతగా తెలీనే తెలీదు. ఎవరో తెలీని ముఖాలు అయినా నెగెటివిటీ మాత్రం స్ప్రెడ్ అయ్యింది. ముంబై వాళ్లకు ఇలాంటి వెస్ట్రన్ కల్చర్ కొత్తేమీ కాకపోవడంతో అందరూ సందేహించారు. ఇకపోతే ఈ గొడవకు అసలు కారణం ఆ ఇద్దరినీ బిగ్ బాస్ సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడమేనన్నది రకరకాల సందేహాలకు తావిస్తోంది. వేలకు వేలు తగలేసి గల్లీ నుంచి దిల్లీ వరకూ వెళ్లి పోరాడేంత శక్తి వీళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలిదంతా ఎవరు చేయిస్తున్నారు? దీని వెనక నాగార్జున శత్రువులు కానీ.. లేదా బిగ్ బాస్ నిర్వాహకులు- స్టార్ మా వ్యతిరేక శక్తులు కానీ పని చేస్తున్నాయా? అంటూ ఒకటే ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వ్యవహారంలో ఏది నిజం? ఏది అబద్ధం? అసలేం జరుగుతోంది? అన్నది పైవాడికే తెలియాలి.