బిగ్‌బాస్ సీజన్ 3తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్. ఈ సీజన్ విజేతగా నిలిచిన రాహుల్ నిత్యం ఏదో ఒక వార్తలో వుంటున్నాడు. తాజాగా బుధవారం రాత్రి రాహుల్ సిప్లిగంజ్‌పై గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో కొంత మంది వ్యక్తులు బీరు బాటిల్స్‌తో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో రాహుల్‌పై కొన్ని బీర్ బాటిల్స్‌ని పగల గొట్టారు. కొంత మంది అదే బాటిల్స్‌తో అతనిపై దారుణంగా దాడికి దిగారు. ఇలా రాహుల్‌పై దాడికి దిగిన వారిలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు కూడా వున్నట్టు సీసీ టీవీ పుటేజీలో బయటపడింది.
దీనిపై వెంటనే రియాక్ట్ అయిన రాహుల్ సోషల్‌మీడియా వేదికగా కేటీఆర్‌ని తనకు న్యాయం చేయమని ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని కేటీఆర్‌కు ట్యాగ్ చేసిన రాహుల్ ఆసక్తికరమైన పోస్ట్‌తో కేటీఆర్‌ని రిక్వెస్ట్ చేశాడు. ఈ వీడియో చూసి న్యాయం ఎవరి వైపు వుంటే వారి వైపు మాట్లాడండి, వారికి న్యాయం చేయండి అని విజ్ఞప్తి చేశాడు. తాను టీఆర్ ఎస్‌కు మద్దతుదారుడినని, తాను పుట్టి పెరిగింది తెలంగాణలోనేనని, తెలంగాణ కోసం నాకు చేతనైన ఉపకారం చేస్తూనే వుంటానని చెప్పుకొచ్చాడు. తకు న్యాయం చేస్తారని చెప్పుకొచ్చాడు.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎమ్మెల్యే సోదరుడు ఇలా దుర్వినియోగం చేస్తూ తమ అధికారిన్ని ఇలా దాడులకు ఉపయోగించడం తగదు. ఈ సంఘటనపై మీరు తీసుకునే చర్యల కోసం ఎదురుచూస్తున్నాను. `ని కేటీఆర్‌ని సూటిగా ప్రశ్నించాడు. అంతా బాగానే వుంది కేటీఆర్ స్పందిస్తాడా? సొంత పార్టీ నేత తప్పుని ఒప్పుకుంటాడా? అన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది.