హేమ సంచలన వ్యాఖ్యలు బిగ్ బాస్ పై

బిగ్‌బాస్‌-3 నుంచి కావాలనే తనను బయటకు పంపారని ఆరోపించారు. ఈ షోలో ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలేదన్నారు. లోపల ఒకటి జరిగితే బయట ఒకటి ప్రసారం చేశారని విమర్శించారు. కాగా ఆదివారం జరిగిన మొదటి ఎలిమినేషన్‌ ప్రక్రియలో హేమ హేమ బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడిన సంగతి తెలిసిందే. 15 మందిలో మొత్తం ఆరుగుగు.. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు తొలివారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. వీరిలో అందరూ ఊహించనట్లే షో నుంచి హేమ ఎలిమినేట్‌ అయ్యారు.

సెల్ఫీ మూవ్‌మెంట్‌ అనంతరం హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన హేమ.. తన జర్నీకి సంబంధించిన ప్రోమోను చూస్తూ ఎమోషనల్‌ అయ్యారు. వంటగది వల్లే గొడవలు వచ్చాయని, అది తప్ప తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. ఓ మదర్‌ ఫీలింగ్‌తో ఉన్నానని, అయితే ఎక్కువ పెట్టుకోవద్దు.. అది తీయోద్దు ఇది తీయోద్దు అని అనడంతో అది డామినేట్‌ చేయడం, కమాండింగ్‌లా అందరికీ అనిపించిందని.. అందుకే అందరూ తనను బ్యాడ్‌ అని అనుకున్నారని తెలిపారు. వాళ్ల కోసం చేసేది వాళ్లకే అర్థం కానప్పుడు అక్కడ ఉండటం వ్యర్థమనిపించిందని చెప్పారు. హౌస్‌మేట్స్‌ గురించి మాట్లాడుతూ.. అదరూ మంచివాళ్లేనని తెలిపింది. హౌజ్‌మేట్స్‌లో నచ్చవారు ఎవరైనా ఉన్నారా అని నాగార్జున అడగ్గా.. అలాటిందేమి లేదని, అందరూ మంచి వారేనని, మంచిగా గేమ్‌ ఆడుతున్నారని చెప్పుకొచ్చింది. శ్రీముఖి.. బాబా భాస్కర్‌ మాత్రం ఫైనల్‌ వరకు ఉండొచ్చని తెలిపారు.