శ్రీ‌ముఖిని డైరెక్ట‌ర్లు అలా వేధించారా?

శ్రీ‌ముఖిని డైరెక్ట‌ర్లు అలా వేధించారా?

సినిమాల్లో రాణించాలంటే చాలా వ‌ర‌కు సాక్రిఫై చేయాలి. ఎవ‌రు ఎలాంటి ఆబ్లీగేష‌న్స్ వుంటాయి.. ఇక హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే అన్నీ అంగీక‌రించాల్సిందే. అవ‌స‌రం వున్నా లేక‌పోయినా.. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా చేయ‌క‌పోయినా ఎక్స్‌పోజింగ్ , లిప్ లాక్‌లకు సిద్ధ‌ప‌డాల్సిందే. అందుకు ఏమాత్రం అంగీకరించ‌ని వారికి కెరీర్ అనేదే వుండ‌దు. శ్రీ‌ముఖి విష‌యంలోనూ అచ్చం ఇదే జ‌రిగింద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టింది.

అల్లు అర్జున్‌తో త్రివిక్ర‌మ్ కూపొందించిన `జులాయి` సినిమాతో న‌టిగా కెరీర్ ప్రారంభించిన శ్రీ‌ముఖి ఆ త‌రువాత కూడా కొన్ని చిత్రాల్లో న‌టించింది కానీ ఏ సినిమాలోనూ ప్రాధాన్య‌త వున్న పాత్ర‌లు ద‌క్క‌లేదు. హీరోయిన్‌గానే రాణించాలంటే ఎక్స్‌పోజింగ్‌తో పాటు లిప్ లాక్ స‌న్నివేశాల్లో న‌టించాల్సిందేనని డైరెక్ట‌ర్‌లు శ్రీ‌ముఖిని బ‌ల‌వంత పెట్టార‌ట‌. అది న‌చ్చ‌కే తాను సినిమాల్లో న‌టించ‌డం మానేశాన‌ని, బుల్లితెర‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిపోయాన‌ని శ్రీ‌ముఖి అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టింది.