సినీనటి అన్నపూర్ణ ఇంట్లో విషాదం

సినీ అభిమానులకు ఓ చేదువార్త . సినీనటి అన్నపూర్ణ కుమార్తె కీర్తి అనారోగ్య కారణాలతో బంజారహిల్స్ లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అన్నపూర్ణకు పిల్లలు లేకపోవడంతో కీర్తిని దత్తత తీసుకున్నారు. ఆమెకు వెంకట కృష్ణతో వివాహం జరిపించారు. వీరికి సంవత్సరం వయస్సున్న కొడుకున్నాడు. కీర్తి భర్త రాయచూర్ లోని ఎఫ్ సీఐ లో క్లర్క్ గా పనిచేస్తున్నారు. వీరు బంజారాహిల్స్ లోని  శ్రీనగర్ కాలనీలోని కృష్ణా అపార్ట్ మెంటులో నివాసముంటున్నారు. కీర్తి గత కొంత కాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. చికిత్స తీసుకున్నప్పటికి తగ్గకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబసభ్యులు వెల్లడిస్తున్నారు. పోలీసులు కీర్తి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, అనుమానాస్సద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్యానుకు ఉరివేసుకున్న కీర్తి