చైతూతో కమ్ముల నెలాఖరు నుంచి
అక్కినేని నాగచైతన్య నటించిన `మజిలీ` రిలీజై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ఆ సినిమా సక్సెస్ అయినా ఇంకా చైతూ కొత్త సినిమా ప్రారంభించలేదు. శేఖర్ కమ్ములతో సినిమాకి ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి కానీ రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పుడు అన్నది ఇంకా ప్రకటించనేలేదు.
తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 25న ప్రారంభిస్తారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కథాంశం కూడా లీకైంది. కమ్ముల ఈ చిత్రాన్ని తన శైలికి భిన్నంగా తెరకెక్కించనున్నారని ఎంచుకున్న కథ చెబుతోంది. ఇది డ్యాన్స్ బేస్డ్ సినిమా. అయితే కథానాయిక కోణంలో సాగే క్లాసిక్ డ్యాన్సర్ సినిమానా లేక కథానాయకుడు ర్యాపర్ తరహాలో కనిపిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. చైతూ- సాయి పల్లవి జంటపై ఆరంభమే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారట. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నది ప్లాన్.