పప్పీకి దొరికిపోయిన ప్రేమ జంట
అక్కినేని నాగచైతన్య, సమంత జంట ప్రేమాయణం ఆల్వేస్ హాట్ టాపిక్. ఏమాయ చేశావే సినిమాలో నటించిన రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత యువ జంట దాగుడు మూతల గురించి అక్కినేని కాంపౌండ్ కే లీక్ కానంత జాగ్రత్త పడ్డారు. సమంత ఎప్పుడు ఆ కాంపౌండ్ లో అడుగు పెట్టినా అక్కడ ఓ పప్పీ తనని ఇట్టే గుర్తు పట్టేసేదని అది అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తనకు మొదట తెలిసేది కాదని కింగ్ నాగార్జున ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చైతూతో కలిసి సమంత సాగించిన ప్రేమాయణం ఆ పప్పీకి మాత్రమే తెలుసునని నాగార్జున అన్నారు.
ఏడెనిమిదేళ్ల పాటు సాగిన ఆ ప్రేమికులు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత ఈ లవ్ కపుల్ అందరికీ ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కలిసి నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ కపుల్ గానూ పేరు తెచ్చుకున్నారు. తాజాగా మామగారి 60వ పుట్టిన రోజు వేడుకలు సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేసిన సమంత .. స్పెయిన్ ఇబిజ నుంచి ఫ్యామిలీ వెకేషన్ ఫోటోల్ని షేర్ చేసింది. వాటిలోంచి ఓ ఫోటోని మహేష్- నమ్రత జంట ఫోటోతో జత చేసి సేమ్ టు సేమ్ అంటూ నమ్రత మహేష్ వ్యాఖ్యానించడం ఆసక్తికరం. నమ్రత, మహేష్ జంట మధ్యా ఆన్ లొకేషన్ ప్రేమాయణం అన్నివేళలా హాట్ టాపిక్. ఆ ఇరు జంటల ప్రేమకథల్ని గుర్తు చేస్తున్న ఈ ఫోటో అక్కినేని ఫ్యాన్స్ సహా మహేష్ ఫ్యాన్స్ లోనూ జోరుగా వైరల్ అవుతోంది. మొత్తానికి టాలీవుడ్ హాట్ కపుల్స్ ఇతరులకు ఇలా గోల్స్ సెట్ చేశారు. మహేష్, చైతూకి లేడీ ఫ్యాన్స్ లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ ఫోటో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది. ఈ వెకేషన్ పూర్తి చేసుకున్న అనంతరం తిరిగి అక్కినేని హీరోలు బిజీ కానున్నారు. సమంత పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నారు.