కింగ్ బ‌ర్త్ డే గిఫ్ట్: `మ‌నం` ఫేం విక్ర‌మ్.కె.కుమార్‌తో యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య 20వ చిత్రం టైటిల్ ఇదే!

Nagarjuna

కింగ్ బ‌ర్త్ డే గిఫ్ట్ అదిరింది. `మ‌నం` ఫేం విక్ర‌మ్.కె.కుమార్‌తో యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య 20వ చిత్రం టైటిల్ ని ప్ర‌క‌టించారు. ఏమిటా టైటిల్.. ? ఇంత‌కీ ఏ బ్యాన‌ర్ లో ఈ మూవీ?

king nagarjuna birthday gift
king nagarjuna birthday gift

నేటితో కింగ్ నాగార్జున 61వ వ‌సంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు వైల్డ్ డాగ్ టీమ్ స‌హా ల‌వ్ స్టోరి టీమ్ నుంచి కానుక‌లు అందాయి. తాజాగా శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సిస‌లైన గిఫ్ట్ ని అందించింది.. ఏమిటా గిఫ్ట్ అంటే..!

.యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై `థాంక్యూ` సినిమా త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న 20వ చిత్ర‌మిది. కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇష్క్‌, మ‌నం, 24 వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లు

“ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స్టైల్లో స‌రికొత్త‌గా నాగ‌చైత‌న్య‌ను ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుంది. చైతు, విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన క్లాసిక్ మూవీ మ‌నం చ‌క్క‌ని విజ‌యం సాధించింది. ఇప్పుడు అదే కాంబోలో సినిమాను చేయనుండ‌టం ఆనందంగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం“ అని నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రానికి బి.వి.ఎస్. రవి మాట‌లు అందిస్తున్నారు.