మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయి సోషల్ మీడియా రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఇప్పటికీ ఆచార్య మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
అందులోనూ ఈ సినిమా కొరటాల దర్శకత్వంలో వస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక.. మోషన్ పోస్టర్ లో సినిమా కథను కొంచెం తెలియపరచగా.. అసలు సినిమా మెయిన్ కీ పాయింట్ కూడా తెలిసిపోయింది.
మోషన్ పోస్టర్ లో చూపించినట్టుగా ధర్మస్థలి అనే గ్రామం కోసం జరిగిన పోరాటమే ఈ సినిమా. అయితే.. ఈ అక్కడ ఏం పోరాటం జరిగింది? అనేది మరో సస్పెన్స్. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… ధర్మస్థలిలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఉన్న విలువైన విగ్రహాల చోరీ, దేవాలయ భూముల కబ్జాపై పోరాటమే సినిమా మెయిన్ పాయింట్.
ఈ మెయిన్ పాయింట్ తో పాటు చిరంజీవి రోల్ కు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ కానున్నాయట. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక రోల్ లో నక్సలైట్ గా కనిపించనుండగా.. మరో రోల్ లో దేవదాయ శాఖ అధికారిగా కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే.. కరోనా రావడంతో మధ్యలో ఆగిపోయింది. మళ్లీ త్వరలోనే సినిమా షూటింగ్ పున:ప్రారంభం కానుంది. ఈసినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన రష్మిక మందన్న నటిస్తుండగా… చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది.
ఇక.. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, 151వ సినిమా సైరాలో మిస్సయిన అన్ని ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు కొరటాల. మొత్తానికి ఒక మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అవన్నీ జోడించి ఈ సినిమాను ఒక అద్భుతంగా మలచబోతున్నాడు కొరటాల శివ. అందుకే ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాయడం పక్కా అంటూ ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.