Koratala Shiva: కొరటాల శివ బర్త్ డే స్పెషల్.. దేవర 2 సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Koratala Shiva: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో చాలా సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొరటాల శివ. చివరగా ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించింది. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు కొరటాల శివ. ఇది ఇలా ఉంటే నేడు కొరటాల శివ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు టాలీవుడ్ సెలబ్రిటీలు కొరటాల శివకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అందులో భాగంగానే తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా కొరటాల శివకు బర్త్ డే విషెస్ చెబుతూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు శివ.. నిశ్శబ్దం, శక్తి ద్వారా మాట్లాడే ఫిలిం మేకర్. నీ నుంచి స్ఫూర్తినిచ్చే మరిన్ని కథలు, మాతో జీవించే క్షణాలు కావాలని కోరుకుంటున్నాను. మరోసారి అలల వెంట ప్రయాణించడానికి వేచి ఉండలేకపోతున్నాను అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సెట్స్ లో కొరటాలతో ఉన్న ఒక అన్ సీన్ ఫోటోని షేర్ చేసారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.మరోసారి అలల వెంట ప్రయాణించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ తారక్ దేవర 2 సినిమాపై పోస్ట్ పెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దేవర 2 తప్పకుండా ఉంటుంది. ఎన్టీఆర్ అందుకే అలా ట్వీట్ చేసారు. దేవర సీక్వెల్ ఉంటుందని ఎన్టీఆర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కొరటాల శివా ప్రస్తుతం దేవర 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ చేతుల్లో నాలుగైదు సినిమాలు ఉండడంతో దేవర 2 సినిమా రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.