Top Directors of 2024: 2024లో సక్సెస్ ని అందుకున్న దర్శకులు వెళ్లే.. టాప్ లో ఆ డైరెక్టర్!

Top Directors of 2024: 2024 ఏడాది చాలామంది డైరెక్టర్లకు సక్సెస్ఫుల్ ఇయర్ గా నిలిచింది. ముఖ్యంగా చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు మంచి హిట్ ఇచ్చి బూస్ట్ ని ఇచ్చిందని చెప్పాలి. మరి ఈ ఏడాది ఏ ఏ డైరెక్టర్లు సక్సెస్ఫుల్ అయ్యారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ ఏడాది డైరెక్టర్లలో సూపర్ సక్సెస్ ఫుల్ గా నిలిచిన డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన పుష్ప సినిమా ప్రస్తుతం 1800 కోట్లు దిశగా దూసుకుపోతోంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఇంతవరకూ ఎవరికీ లేని క్రేజీ రికార్డ్ ని సొంతం చేసుకున్న పుష్ప 2 సక్సెస్ కి మూలం అయ్యారు సుకుమార్. బాహుబలి లాంటి సినిమా బెంచ్ మార్క్ ని రీచ్ అవ్వాలని ట్రై చెయ్యడం అంత ఈజీకాదు.

అందులోనూ రాజమౌళి లాంటి డైరెక్టర్లని బీట్ చెయ్యగలిగే నెక్ట్స్ లెవల్ కంటెంట్ ని, నెక్ట్స్ లెవల్ వరల్డ్ ని క్రియేట్ చెయ్యడం, ఆడియన్స్ ని కన్విన్స్ చెయ్యడం అంటే దానికి చాలా హోమ్ వర్క్, కమిట్ మెంట్ ఉండాలి. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కల్కి సినిమతో ప్రూవ్ చేసుకున్నారు. కలిగి సినిమాతో ప్రభాస్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ఇవ్వడం మాత్రమే కాకుండా డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ క్రియేషన్ కూడా తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈ ఏడాదిలో సక్సెస్ ఫుల్ గా నిలిచిన డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు.

ఇక ఏడాది ప్రారంభంలో పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో చిన్నసినిమా అయినా కూడా సంక్రాంతి బరిలోకి ధైర్యంగా దిగారు. ఇక్కడ హీరోగా తేజ యాక్టింగ్ ఓవరాల్ పర్ ఫామెన్స్ కంటే డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ కే క్రెడిట్ ఎక్కువ దక్కుతుంది. అంతలా క్రియేటివ్ కంటెంట్ ని , తక్కువ బడ్జెట్ లో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో చూపించి 300కోట్ల భారీ సక్సెస్ ఇచ్చి ఈ సంవత్సరం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. వెంకీ అట్లూరి ఇంతకుముందే సార్ మూవీ తో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అలాగే లక్కీ భాస్కర్ మూవీ డైరెక్టర్ వెంకీ కి కూడా లక్ తెచ్చిపెట్టింది. 100 కోట్ల సక్సెస్ అందించింది. దాంతో లాస్ట్ ఇయర్ తో పాటు ఈ సంవత్సరం కూడా వెంకీ అట్లూరి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు.