గంగోత్రి మూవీతో తెలుగు తెరకు, అల్లు అరవింద్ కొడుకుగా పరిచయమైనా అనతి కాలంలోనే తనకంటు ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. దాని వెనక ఎంత శ్రమ దాగివుందో అది ఆయనకే తెలుసు. ఇక ఈ మధ్య కాలంలో సినిమాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేగం కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే 2016 నుండి ఆయన ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఈ ఆలస్యానికి కారణం లేకపోలేదు. ప్రతి సినిమాకు, ప్రతి పాత్రకు వైవిధ్యం చూపాలని బన్నీ అనుకోవడమే ఈ నెమ్మదితనానికి కారణం.
ఈ విషయం పై ఒకసారి విశ్లేషిస్తే 2015లో వచ్చిన’రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రలో అలరించిన బన్నీ ఆ తర్వాత చేసిన ఎవడు తో పాటు తను చేసే ప్రతి సినిమాలోనూ ప్రత్యేకత చూపుతూనే ఉన్నారు. ఇక ‘సరైనోడు’లో ఫిట్ అండ్ ఫాస్ట్ అన్నట్టు కనిపించిన అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో పంచెకట్టి తనదైన కామెడీ టైమింగ్ ప్రదర్శించి అలరించారు.అలాగే ఆ తర్వాత చేసిన’నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో యాంగ్రీ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించి ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త చిత్రం ‘అల వైకుంఠపురం’లో ఇంకో కొత్త లుక్ తో మన ముందుకు వస్తున్నాడు..’అల వైకుంఠపురం’లో ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్,ఫస్ట్ లుక్ పొస్టర్స్ చూస్తే క్లాస్ లుక్,మాస్ మేనరిజమ్ కలగలిసిన పాత్రలో బన్నీ నటిస్తున్నట్టు అర్థం అవుతోంది.
ఇక మహేష్‌బాబు మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోకిరి, బిజినెస్‌మ్యాన్, ఒక్కడు, అతడు ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి మాస్ ఫాలొయింగ్‌ని సంపాదించాడు. అలాగే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచి అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వచ్చే సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి మళ్లీ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే పనిలో ఉన్నాడు మహేష్ ఇక ఈ సంక్రాంతికి మాస్ ఆడియన్స్‌కి పండగే పండగ అని చెప్పాలి.