మోక్ష‌జ్ఞ ఎంట్రీకి మోక్షం క‌లిగేది ఎప్పుడు?

నంద‌మూరి మోక్ష‌జ్ఞ తెరంగేట్రం ఈ ఏడాది వుంటుంది. అంటు ఈ ఏడాది వుంటుంది అంటూ గ‌త రెండు మూడేళ్లుగా వార్త‌లు షికారు చేస్తూనే వున్నాయి. సింగీతం శ్రీ‌నివాస‌రావు రూపొందించాల‌నుకున్న `ఆదిత్య 999` ద్వారా మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్టే కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌డంతో బోయ‌పాటి ప‌రిచ‌యం చేసే అవ‌కాశం వుంద‌ని కొన్ని నెల‌లు లేదు క్రిష్ చేసే అవ‌కాశ వుంద‌ని కొంత కాలం వార్త‌లు జోరుగా వినిపించాయి.

నంద‌మూరి ఫ్యాన్స్ కొత్త ర‌క్తం వ‌చ్చేస్తోందంటే సంబ‌ర‌ప‌డ్డారు. కానీ ఆ సంబంరం ఎంతో సేపు నిల‌వ‌లేదు మోక్ష‌జ్ఞ ఎంట్రీకి సంబంధించి బాల‌య్య నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే `లెజెండ్` స‌మ‌యంలో
చాలా హ్యండ్స‌మ్‌గా క‌నిపించిన మోక్ష‌జ్ఞ ఆ త‌రువాత నుంచి భారీగా పెర‌గ‌డం మొద‌లుపెట్టాడు. డైటింగ్‌, ఎక్సర్ సైజులు అనేవి అత‌ని డిక్ష‌న‌రీలోనే లేవా అనేంత‌గా త‌యార‌య్యాడు. మోక్ష‌జ్ఞ తాజా లుక్ చూసిన బాల‌య్య అభిమానులంతా ఏంటి బాల‌య్యా ఇది అని బావురుమ‌న్నార‌ట‌.

హీరో ల‌క్ష‌ణాలే క‌నిపించ‌క‌పోవ‌డంతో సీరియ‌స్ అయిన బాల‌య్య కొడుకుని న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి మూడు నెల‌ల యాక్టింగ్ శిక్ష‌ణ కోసం బ‌ల‌వంతంగా పంపించిన‌ట్టు తాజాగా ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో గుస గుస‌లు వినిపిస్తున్నాయి. మోక్ష‌జ్ఞ‌లో సినిమాల్లో న‌టించాల‌న్న ఆలోచ‌న స‌న్న‌గిల్ల‌డానికి కార‌ణం ఎవ‌రు? ఎందుకు ఆస‌క్తి చూపించ‌డం లేదు. 25 ఏళ్లు దాటినా ఇంకా వార‌సుడిని బాలయ్య ఎందుకు వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌డం లేదు? మోక్ష‌జ్ఞ ఎంట్రీకి మోక్షం ఎప్పుడు? . ఈ ఏడాదైనా వుంటుందా? అని నంద‌మూరి ఫ్యాన్స్ ఫీల‌వుతున్నార‌ట‌.