టాలీవుడ్‌లో తార‌క్‌ ప్ర‌యాణం… నంద‌మూరి ఆశాకిర‌ణం!

జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఆయన తల్లి షాలిని మాత్రం ముందు నుంచి కూడా తెరవెనుక మనిషిగానే ఎక్కువగా ఉంటూ వస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె మాత్రం బయట ప్రపంచానికి దూరంగానే ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే నందమూరి తారకరామారావు హీరోగా నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో బాలనటుడుగా తెలుగు చిత్ర పరిశ్రములోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్.. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక 2001లో వచ్చిన నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఆది,యమదొంగ, ఇలా పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో ఒకడిగా చేరాడు ఎన్టీఆర్.. అయితే కథల ఎంపీకలో భాగంగా ఎన్టీఆర్ కొన్ని సినిమాలను వదులుకున్నాడు కూడా.

ఎన్టీఆర్ కెరియ‌ర్ మొద‌లు పెట్టిన స్టార్టింగ్‌లో స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్, ఆది, సింహాద్రి లాంటి చిత్రాల్లో న‌టించి మాస్ ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకున్నాడు. ఆ చిత్రాల‌తో ఒక్క‌సారిగా ఆయ‌న ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎన్టీఆర్ ను తమ కుటుంబ సభ్యుడిగా గుర్తించేందుకు ఒప్పుకోలేదు. ఎన్టీఆర్ వార సత్వరంగా స్టార్ హీరో అవలేదు. తన స్వయం కృషిని స్వశక్తిని నమ్ముకుని కేవ‌లం త‌న టాలెంట్‌తో హీరో అయ్యాడు.

ఎన్టీఆర్ హీరో అయినప్పుడు హరిక్రిష్ణ కొడుకు అంట సేమ్ తాత ఎన్టీఆర్ లాగా ఉన్నాడు అని జనాలు చెప్పుకునేవారు ఎన్టీఆర్ క్రేజ్ ఎప్పుడైతే ఒక్కసారిగా పెరిగిందో అప్పటి నుంచి చంద్రబాబు నందమూరి ఫ్యామిలీకి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. చంద్రబాబు అయితే ఎన్టీఆర్ కు పోటీగా తారకరత్నను సీన్‌లోకి దించాడు. అప్ప‌ట్లో ఒకే రోజు ఏకంగా 9 సినిమాలు స్టార్ట్ చేశాడు. పైగా తారకరత్న తొలి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు కి రాఘవేంద్రరావు దర్శకత్వం ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగిందన్న ప్రచారం కూడా అప్ప‌ట్లో బాగా జ‌రిగింది. తార‌క్ కూడా అప్ప‌ట్లో మంచి పేరు అయితే వ‌చ్చింది కానీ ఎన్టీఆర్ లాగా అంత క్రేజ్ మాత్రం సంపాదించుకోలేక‌పోయాడు. అలాంటి ఎన్టీఆర్ నేడు నందమూరి ఈ కుటుంబానికి కోటలో ఉన్న నందమూరి కుటుంబ అభిమానులకు ఆశాకిరణంగా మారాడు.