ఇండియన్ 2 ‘ లో సిద్ధార్ధ్

కమల్ హాసన్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ రానున్న ‘ఇండియన్ 2 ‘ చిత్రం ఇక లేదేమో అని అనుకున్నారు అంతా. కానీ మళ్ళీ ఈ చిత్రం పట్టాలెక్కింది. బడ్జెట్ సమస్యలు వీడి షూటింగ్ జరుగుతోంది. శంకర్ భారీ బడ్జెట్ చిత్రమైన ఈ సినిమాలో కమల్ హాసన్ హీరో. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో హీరో సిద్ధార్ధ్ కనిపించనున్నారు.

హీరో సిద్ధార్ధ్ తెలుగులో తెరమరుగయ్యి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఆయన తమిళ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఆయనకి ఉన్న సినిమాల్లో ఇది పెద్ద సినిమా అనుకోవచ్చు. కమల్ హాసన్ సినిమాలో నటించడమంటే మళ్ళీ ఆయనకు సినిమా పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం.