అమ‌రావ‌తిలో ల‌బోదిబోమంటున్న టాలీవుడ్ సెల‌బ్రెటీలు… ఎందుకంటే?

అమ‌రావ‌తిలో టాలీవుడ్ సెల‌బ్రెటీల బినామీ భాగోతం… ర‌చ్చ‌మాములుగా లేదుగా?

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌ధాని ఏది అని తేల్చే టాపిక్ పై వేడి వేడి మంట‌లు రేగుతున్న విష‌యం తెలిసిందే…రాజ‌ధాని లీక్డ్ విష‌యం ముందుగానే తెలిసిన కొంద‌రు వ్య‌క్తులు అక్క‌డ వంద‌ల ఎక‌రాల‌ను కొనుగోలు చేసిన వాళ్ల‌కి ఇప్పుడు నిరాశే మిగిలేట‌ట్టు ఉంది. కంటి పై కునుకు లేకుండా రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా క‌ష్ట‌ప‌డి ప్ర‌జ‌లంతా ఎదురు చూస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని అవుతుంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వాళ్ళ ఆశ‌ల‌న్నీ అడిఆశ‌లు అయ్య‌యి. గ‌తంలో అమ‌రావ‌తి రాజ‌ధాని అని తెలియ‌గానే చాలా మంది బ‌డా బాబులు ఆగ‌మేఘాల్లో వ‌చ్చి రాజకీయ నాయకులు.. పారిశ్రామిక వేత్తలు.. పత్రికాధిపతులు వీళ్లతో పాటే సినీప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు వీరంతా గొల్లుమనాల్సిన ధైన్యమైన స్థితి. సీఎం వైయస్ జగన్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో అమరావతి రాజధాని అటకెక్కింది. అమరావతి పేరుతో రియల్ వెంచర్లు ప్లాన్ చేసిన బడా బాబులకు చుక్కలు కనిపించాయి. రాజధాని వైజాగ్ కి తరలి వెళ్లిపోతోందన్న కలత కంటికి కునుకు పట్టనీకుండా చేస్తోంది. ప్ర‌స్తుతం వాళ్ళ గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాడు ఈ యంగ్ సీఎం జ‌గ‌న్‌.

ఇక ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ విష‌యానికి వ‌స్తే ఓ సినీ హీరో పెద్ద మొత్తంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టడంపై ప్రస్తుతం టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. తన చుట్టాలు పక్కాలు బంధువుల పేరుతో అతడు దాదాపు 500 ఎకరాలు కొనిపించారట. ఇప్పుడు ఉన్న ఫలాన రాజధాని విశాఖ నగరానికి జంప్ అయిపోవడంతో కక్కలేక మింగ లేక లబోదిబోమనే పరిస్థితి నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఐదు వంద‌ల ఎక‌రాలంటే మామూలు మాట‌లు కాదు. దాని కోసం ఎన్నో కోట్ల‌ను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిందంతా పెట్టుబ‌డి రూపంలో పెట్టి. చేతుల కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లు ఉంది ప్ర‌స్తుతం వాళ్ళ ప‌రిస్థితి. రాజధాని బూచీతో ఒక్కో ఎకరం రూ.3-5 కోట్ల మేర డిమాండ్ పలికింది. అంత పెద్ద మొత్తం అయినా ఎలాంటి భయం లేకుండా అన్ని ఎకరాల్ని కొనేశారు. ఇప్పుడు రాజధాని తరలిపోవడంతో ఏకంగా లక్షల్లోకి విలువ పడిపోయింది. దీంతో కక్కలేని మింగలేని పరిస్థితి నెలకొందట. గొల్లుమనలేక.. లబోదిబోమని బయటపడలేక ఇంకా షాక్ లోనే ఉన్నారట. తొంద‌ర‌ప‌డి చేసే ప‌నులు కొన్ని అస‌లుకే కొస‌రు అన్న ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్పుడు క‌నీసం వాళ్ళు పెట్టుకున్న క‌నీస ధ‌ర‌లు వాటికి వ‌చ్చినా మేలే అని మ‌రి కొంద‌రు బాధ‌ను వెళ్ళ‌గ‌క్కుకుంటున్నారు.