సోషల్ మీడియా వచ్చిన దగ్గరి నుంచి సెలబ్రిటీలు, సామాన్యులు అనే లేడా లేకుండా పోయింది. ఎవరు ఎలా స్పందించిన తేడా అనిపిస్తే నెటిజన్స్ లెఫ్ట్ రైట్ వాయించేస్తున్నారు. ట్విట్టర్ వేదికగానే నిలదీస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మనం మూడవ దశలోకి ఎంటరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని స్పరించేలా తమిళ సూపర్‌స్టార్ ఓ వీడియోని పోస్ట్ చేశారు.
దీనిపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేదిగా రజనీ వీడియో వెందని విమర్శల వర్షం కురవడంతో వెంటనే ట్విట్టర్ ఆ వీడియోని తొలగించింది. తాజాగా అలాంటి పనే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చేసి పప్పులో కాలేశారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా అంతా సాయంత్రం బాల్కనీల్లోకి వచ్చి డాక్టర్లకు, నర్సులకు, పోలీస్ శాఖ వారికి సంఘీభావంగా హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టాలని ప్రధాని సూచించారు. దీంతో జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీనిపై బిగ్‌బి పెట్టిన పోస్ట్ వివాదంగా మారింది.
చప్పట్లు కొడితే వైరస్ పోతుందా? అంటే బిగ్‌బి పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్స్ బిగ్‌బీని ఓ ఆట ఆడుకున్నారు. మీలాంటి వారు ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం ఏంటని నిలదీశారు. జరుగుతున్న నష్టాన్ని గమనించిన బిగ్‌బీ వెంటనే ఆ పోస్ట్‌ని తొలగించి ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.