‘సైరా’ మూవీకి బ్రేక్ పడింది.

‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. నయనతార కథానాయికగా నటిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ‘సైరా’ను రాంచరణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో సినిమా రిలీజ్ ఆలస్యమయ్యేలా ఉంది. వర్షం కారణంగా షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటానికి భారీ బడ్జెట్ తో కోకాపేటలో భారీ సెట్ వేశారు చిత్ర బృందం. అక్కడ సీక్వెన్స్ షాట్స్ షూట్ చేయటానికి మూవీ టీం రేయింబవళ్లు కష్టపడుతుంది.

కానీ వర్షం కారణంగా ఆ సన్నివేశాలను చిత్రీకరించడానికి వీలు పడట్లేదట. రెండు రోజులుగా షూటింగ్ కూడా నిలిపివేశారని సమాచారం. వచ్చిన ఆర్టిస్టులు కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారట. కోకాపేటలోని సెట్ లో ప్రస్తుతం నరసింహారెడ్డి బ్రిటిష్ ఎంపైర్ ని ఎదుర్కొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ కోసం కొన్ని వందల మంది జూనియర్ ఆర్టిస్టులు నటించనున్నారట. వర్షంలో షూటింగ్ కుదరదు కాబట్టి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి షూటింగ్ పొడిగించనున్నారని సమాచారం.