సీఎంగా విజయ్ దేవరకొండ కనిపించబోయే సినిమా ఇదే

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న స్టార్ ‘విజయ్ దేవరకొండ’. మహానటి సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులే కొట్టేశాడు. త్వరలో ‘గీత గోవిందం, టాక్సీవాలా’ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్దకు రానున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా మరో సినిమాలో నటిస్తున్నాడు ఈ స్టార్. ఆ సినిమా పేరే ‘నోటా’.

ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో కొనసాగే కథ. మరి ఈ సినిమాలో విజయ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాకి తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘రాజా ది గ్రేట్’ ఫేమ్ మెహ్రీన్ పిర్జాదా కథయినాయికగా కనిపించనుంది. తెలుగు, తమిళం రెండు భాషల్లో తీస్తున్న ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టనున్నాడు హీరో విజయ్. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా తన లక్ టెస్ట్ చేసుకోనున్నాడు.