ప్రియాంక బ్యాచిలర్ పార్టీ ఫోటోలు హల్ చల్

ప్రియాంక చోప్రా డిసెంబర్ 2 న నిక్ జోనస్ వివాహ చేసుకోబుతున్నది .  నిక్ జోనస్  అమెరికన్ గాయకుడు నటుడు . ప్రియాంక కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు  అయితేనేం  వయసు వారి ప్రేమకు అడ్డు రాలేదు . నిక్ ప్రియాంకను చాలా గాఢంగా ప్రేమించాడు . పెద్దలు కూడా తధాస్తు అన్నారు .వీరి వివాహం భారత దేశంలోని జోద్ పూర్ లోని ఉమైద్  భవన్ ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది .

దీపికా పదుకొనె , రణ్వీర్ సింగ్ వివాహం లాగే వీరి వివాహం కూడా భారత , అమెరికా సంప్రదాయం ప్రకారం రెండు సార్లు జరుగుతుందట . ఇందుకు  ఏర్పాట్లు మొదలయ్యాయి . వివాహ దగ్గర  పడుతున్న కొద్దీ ప్రియాక తనకు కావలసిన బట్టలు, నగలు కొనేసుకుంది . పెళ్లి కూతురు  డ్రెస్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది .

ఇక తన బ్యాచిలర్ రోజులను ఆడ స్నేహితురాళ్ళతో  కలసి ఎంజాయ్  చెయ్యాలని నిర్ణయించికుంది .  అందుకే  పరిణితి చోప్రా తో  పాటు ముంభై లోని ఇతర నేస్తాలు, తన కాబోయే భర్త సోదరీమణులను  కూడా ఆహ్వానించి ఆమ్ స్టర్ డమ్ కు వెళ్లి పోయింది . ఇక అక్కడ అందరితో కలసి తన బ్యాచిలర్ పార్టీతో ఎంజాయ్ చేస్తుంది . ఆ ఫోటోలు ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో హల్  చల్  చేస్తున్నాయి .