‘ప్యారిస్ ప్యారిస్’ అంటున్న కాజల్ అగర్వాల్

కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ప్యారిస్ ప్యారిస్’. నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ చిత్రాన్ని తమిళంలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హిట్ సినిమా ‘క్వీన్’ కి రీమేక్ ఇది. క్వీన్ మూవీని తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా, మలయాళంలో మంజిమా మోహన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు సినిమాలను మీడెంటే ఇంటర్నేషనల్ ఫిలిం నిర్మిస్తోంది.

తమిళ ‘ప్యారిస్ ప్యారిస్’ లో కాజల్ అగర్వాల్ పరమేశ్వరిగా కనిపించనున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. వచ్చే నెలలో ట్రైలర్, ఏడాది చివరికి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

పెళ్లి కొడుకు పెళ్లి వద్దనటంతో అనుకోకుండా పెళ్లి ఆగిపోతుంది. చేసేదేం లేక ఒంటరిగా ప్యారిస్ బయలుదేరుతుంది పెళ్లి కూతురు. ఈ ప్రయాణంలో తనకి ఏడువారైనా అనుభవాలేంటి? వాటినుండి తాను ఏం నేర్చుకుంది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటున్నారు కాజల్.