టాలీవుడ్ అందగాడిగా.. ప్రేక్షకుల మనసులు దోచిన రాజకుమారుడిగా.. అమ్మాయిల మదిలో యువరాజుగా తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు మహేష్‌బాబు.
మహేష్‌బాబు హీరోగా నటించిన తొలి చిత్రం 1999లో వచ్చిన ‘రాజకుమారుడు’. దీని తర్వాత వచ్చిన ‘యువరాజు’, ‘వంశీ’ సినిమాలు కొంత నిరాశపర్చినా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2001లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’ మహేష్‌బాబుకు తొలి విజయాన్నందించింది. ఇక మహేష్‌బాబు కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’. ఆ సినిమా తర్వాత మహేష్ క్రేజ్ భారీగా పెరిగింది. అదే ఏడాది వచ్చిన ‘నిజం’ పరాజయం పాలైనా.. అందులో మహేష్ అభినయానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి.
అనంతరం వచ్చిన ‘అర్జున్’, ‘నాని’ చిత్రాలు నిరాశపర్చాయి. ఇలాంటి సమయంలో 2005లో త్రివిక్రమ్‌తో చేసిన ‘అతడు’తో మహేష్ భారీ విజయాన్నందుకున్నాడు. 2006లో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ టాలీవుడ్లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. అందులోని మహేష్ నటనకు యావత్ ప్రేక్షకలోకం నీరాజనాలు పలికింది. ఆ తర్వాత ‘సైనికుడు’తో తన కెరీర్లోనే పెద్ద పరాజయాన్ని చవిచూశాడు మహేష్. దీంతో మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మహేష్‌బాబు ‘ఖలేజా’తో తిరిగి సత్తా చాటాడు. అక్కడి నుంచి ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’ చిత్రాలతో వరుస విజయాలందుకున్నారు.
మధ్యలో ‘బ్రహ్మోత్సవం’, ‘ఆగడు’, ‘1’ ‘స్పైడర్ ’ వంటివి ప్రేక్షకుల అలరించలేకపోయాయి. తర్వాత వచ్చిన ‘భరత్ అను నేను’, శ్రీమంతుడు, మహర్షి చిత్రాలతో తిరిగి హిట్లు సాధించారు. ప్రస్తుతం అనిల్‌రావిపూడి దర్శకత్వంలో `సరిలేరు నీకెవ్వరు చిత్రం`లో నటిస్తున్నారు. ఇక ఆయన గత పదేళ్ళ కెరియర్లో బ్రహ్మోత్సవం, స్పైడర్ కథలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి. ఈ చిత్రాల కథలు సరిగా వినకుండానే ఓకే చేశాడు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా ప్లాప్ అయ్యాయి. లేకుండా ఆ రెండు హిట్లు కూడా పడి ఉంటే మహేష్ ఎక్కడో ఉండేవాడు.. ఇకపోతే సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుంచే తనదైన ప్రత్యేకమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రిన్స్ మహేష్‌బాబు. ఇప్పటివరకు తన సినీ ప్రయాణంలో మొత్తం ఐదు నంది పురస్కారాలు, ఐదు ఫిల్మ్‌ఫెయిర్ అవార్డులు అందుకున్నారు.