Home Tollywood దేవుడు చనిపోయాడు..మెగా బ్ర‌ద‌ర్ సంచ‌ల‌న కామెంట్!

దేవుడు చనిపోయాడు..మెగా బ్ర‌ద‌ర్ సంచ‌ల‌న కామెంట్!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ్ లాంటాడో. ఏ విష‌యంపైనైనా ముక్కు సూటిగా మాట్లాడుతాడు. `నా ఇష్టం` అనే యూ ట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించిన ద‌గ్గ‌ర నుంచి నాగ‌బాబులో ఆ త‌ర‌హా ఒర‌వ‌డి మ‌రింత ఎక్కువైంది. మెగా ఫ్యామిలీని ఎవ‌రైనా విమ‌ర్శిస్తే ముందుగా రంగంలోకి దిగేది నాగ‌బాబు. విమ‌ర్శించిన వాళ్లంద‌ర్నీ చెడామ‌డా క‌డిగేసి..కౌంట‌ర్లు వేస్తారు. ఎవ‌రిది వారికి తిరిగి ఇవ్వాలిగా అన్న‌ట్లు. ఇటీవ‌లే మ‌హ‌త్మాగాంధీని చంపిన గాడ్సే గురించి అంతే గొ‌ప్ప‌గా చెప్పి కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కున్న‌ప్ప‌టికీ అందులో వాస్త‌వం ఉంది అని మ‌ద్ద‌తిచ్చిన వారు లేక‌పోలేదు.

ఈ నేప‌థ్యంతో తాజాగా నాగ‌బాబు మ‌రోసారి త‌న ట్విట‌ర్ ఖాతాకి పెద్ద ప‌నే పెట్టేసాడు. దేవుడు చచ్చిపోయాడంటూ సంచలన కామెంట్ చేశారు. అసలు దేవుడే లేడంటూ ట్వీట్ చేసారు. అంతేకాదు ఈ ట్వీట్ చేస్తూ సూప‌ర్ స్టార్ రజినీకాంత్ గ‌త‌ వ్యాఖ్య‌ల్ని నాగబాబు గుర్తుచేసి…వాటికి గురించి ప్ర‌స్తావించారు. ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ గారు ఓ పాట చెప్పారు. అదేంటంటే? మన కంటికి కనబడే ఏదయినా సరే ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే అయి ఉంటుందని, లేకపోతే ఆ వస్తువుకి ఉనికి ఉండదు. అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికిలో ఉందంటే? ఎవరో ఒక క్రియేటర్ ఉండే ఉండాలి. అతడే భగవంతుడు అని చాలా గంభీరంగా రజినీకాంత్ గారు చెప్పారు’ అని పేర్కొన్న నాగబాబు దానిలో లాజిక్ ని లాగే ప్ర‌య‌త్నం చేసాడు.

మరి అంత క్రియేట్ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు. ఒక శక్తి ఉనికిలో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీజన్ వేరే ఉండాలి. ఆ రీజన్ దేవుడిని క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రీజన్‌కి ఇంకో రీజన్ ఉండాలి. సో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతూ పొంతూ ఉండదు. సో గాడ్ అనే కాన్స‌ప్ట్ కి మీనింగ్ ఏది లేదు. సో లెట్స్ లివ్ అవ‌ర్ లివ్స్ వితౌట్ ది ఇన్వాల్వ్ మెంట్ ఆఫ్ గాడ్ కాన్సెప్ట్. నెటిజ‌న్స్ చెప్పిన‌ట్లు గాడ్ ఈజ్ డెడ్ అని వ‌రుస ట్వీట్ల‌తో హోరెత్తించారు. మ‌రి ఈ ట్వీట్ల వెనుక కార‌ణం ఏమై ఉంటుంది? ప‌్ర‌స్తుతం ప్ర‌పంచంలో…భార‌త‌దేశంలో నెల‌కొన్న కరోనా ప‌రిస్థితులే అయి ఉండొచ్చా! ఏమో అవ్వొచ్చు.

వైర‌స్ మ‌హమ్మారి బారిన ప‌డి ల‌క్ష‌లాది మంది చ‌నిపోయారు. ఇంకెంత మందిని క‌రోనా మృత్యువు మింగేస్తుందో తెలియ‌దు. అస‌లు దీనికి అంతం అనేది ఉందో ? లేదో? కూడా తెలియ‌దు. చ‌నిపోయిన శ‌వాల్ని కూడా ఖ‌న‌నం చేయ‌డానికి..కాల్చ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. గుట్ట‌లుగా శ‌వాలు….కుక్క‌లు పీక్కుతింటున్న బాడీల‌ను చూస్తే గుండె త‌రుక్కుపోతుంది. ఇదా? మ‌నిషి జీవితం అనిపిస్తుంది. మ‌నిషికి మ‌నిషే శ‌త్రువు అయ్యాడు. ఇదేనా మాన‌వ జీవితం?

Related Posts

వివాదాల ‘రిపబ్లిక్’ పరిస్థితి ఏమవుతుందబ్బా.!

రిలీజ్‌కి ముందు వివాదాలు.. అనుకోకుండా ఆయా సినిమాలపై అంచనాలు పెంచేస్తుంటాయి. గతంలో చాలా సార్లు ఈ పరిణామాలు చూస్తూనే వచ్చాం. అయితే, ఈ సారి వివాదం కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News