Nagababu: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి టాక్ సొంతం చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతోంది.. అయితే వైసీపీకి చెందిన కొంతమంది మాత్రం ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తూ సినిమా అట్టర్ ప్లాప్ అని ప్రచారం చేస్తున్నారు. ఇలా ఈ సినిమా గురించి ఈ విధమైనటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేన ఎమ్మెల్సీ సినీ నటుడు నాగబాబు స్పందించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుందని తెలిపారు.. అయితే వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలు మాత్రం సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారికి జనసైనికులు బుద్ధి వచ్చేలా ఈ ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.వాళ్లు చేస్తున్న ప్రచారం దుర్మార్గం అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ అలాగే ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదని.. చురకలు అంటించారు.
ఈ తప్పుడు ప్రచారాలను జనసైనికులు తిప్పి కొట్టినప్పుడే వైసిపి వారికి బుద్ధి వస్తుందని తెలిపారు.మరో 20 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని సెటైర్లు పేల్చారు. ఇక తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని క్లారిటీ ఇచ్చారు నాగబాబు. వచ్చిన పదవిని… ప్రజలకు న్యాయం చేసేందుకు వినియోగించుకుంటానని పేర్కొన్నారు. ఇలా ఈ వీరమల్లు సినిమా గురించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
