Nagababu: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలోకి తిరిగి నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా నాగబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. జబర్దస్త్ కార్యక్రమం గత పుష్కరకాలం నుంచి ఈటీవీలో ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు.
ఇక ఈ కార్యక్రమం ప్రారంభంలో యాంకర్ గా అనసూయ వ్యవహరించగా జడ్జ్ లుగా నాగబాబు, రోజా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. అప్పట్లో మల్లెమాల వారితో వచ్చిన విభేదాల కారణంగానే నాగబాబు తప్పుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియలేదు. ఇకపోతే రోజా మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.
ఇలా 12 సంవత్సరాల నుంచి 700 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా మెగా సెలబ్రేషన్స్ నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో పాల్గొన్న కమెడియన్స్ అందరూ కూడా సందడి చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన రోజ మాత్రం కనిపించలేదు. అలాగే సుడిగాలి సుదీర్ కూడా కనిపించలేదు. ఇలా వీరిద్దరూ కనిపించకపోవడంతో రోజాకు మల్లెమాలవారు ఆహ్వానం అందజేశారా? లేదా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.
ఇలా రోజాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అవమానించారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రోజా కనిపించకపోవడంతో ఏదో తెలియని వెలితి ఉంది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే నాగబాబు తిరిగి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో కేవలం ఈ మెగా సెలబ్రేషన్స్ లో భాగంగా పాల్గొన్నారా? లేదంటే ఈయన పర్మినెంట్గా జడ్జిగా ఉండబోతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు ఈయన జనసేన ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.

