బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి అంతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం వచ్చే ఏడాది 2020 జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమానికి ముందు జరిగిన ఫిక్షన్ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆలియాభట్- ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ప్యాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఉన్న ఈ మూవీకి ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే సాగుతోంది. భారీ ధరలతో ఏరియావైజ్పంపిణీదారులు రైట్స్ కొనడానికి ముందుకు దూసుకువస్తున్నారు. ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా రైట్స్ ని ప్రముఖ పంపిణీదారులు 13.20 కోట్లు వెచ్చించి ఛేజిక్కించుకున్నారని తెలుస్తోంది. గీతా అండ్ షన్ముఖ ఫిలింస్ ఇంత ఫ్యాన్సీ ధరను చెల్లించి రైట్స్ ని కొనుక్కుందట.
దాదాపు 250-300 కోట్ల మధ్య బడ్జెట్ తో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత దానయ్య ప్రకటించారు. దీన్ని బట్టి భారీ రేంజులోనే అన్ని భాషల్లోనూ ప్రీరిలీజ్ బిజినెస్ సాగించాల్సి ఉంటుంది. ఇంకా విడుదలకి ఆరునెలల వ్యవధి ఉంది కాబట్టి ఈ ప్రీరిలీజ్ బిజినెస్లో మరెన్ని మార్పులు జరుగుతాయో చూడాలి మరి. అయితే ఈ సినిమాకి థియేట్రికల్ తో పాటు.. నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా భారీగా ధరల్ని నిర్మాత దానయ్య కోట్ చేస్తున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. మరి అవి ఏ రేంజ్ లో ఉంటాయి ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. ఇంత భారీ బడ్జెట్ సినిమా కాబట్టి అందరి చూపు ఈ రైట్స్ మీద కాస్త ఎక్కువే ఉంటది మరి.