బాక్సాఫీస్ : జపాన్ లో దుమ్ము లేపుతున్న “ఆర్ ఆర్ ఆర్” వసూళ్లు.!

పాన్ ఇండియా మార్కెట్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ సినిమా అయినటువంటి ట్రిపుల్ ఆర్(RRR) తో ఇండియన్ సినిమా మరో లెవెల్ లోకి వెళ్లగా ఇక్కడ నుంచి అయితే ఈ చిత్రం లేటెస్ట్ గా జపాన్ దేశంలో అక్కడ డబ్బింగ్ తో రిలీజ్ అయ్యి జస్ట్ ఒక్క వారంలో టాప్ 3 ఇండియన్ గ్రాసర్ గా నిలిచి రికార్డు నెలకొల్పింది.

ఇక మళ్ళీ సినిమా మొదటి రోజు కన్నా రిలీజ్ అయ్యిన 21వ రోజు లోనే భారీ వసూళ్లు నమోదు అవ్వడం మరో రికార్డుగా మారింది. ఇక ఇప్పటి వారు 226 మిలియన్ జపాన్ యిన్ లు ఈ సినిమాకి వసూలు కాగా నెక్స్ట్ ఈ వారాంతం కూడా మొదటి రోజు ఫస్ట్ షో నుంచే హౌస్ ఫుల్ షోలు నమోదు అవుతుండడం విశేషం.

అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. దీనితో అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్ లో మరింత స్థాయిలో రెచ్చిపోవడం ఖాయం అని ట్రేడ్ పండిట్స్ చెప్తున్నారు. దీనితో అయితే ఈ సినిమాని ఫైనల్ గా ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ఒలీవియా మోరిస్, ఆలియా భట్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే సముద్రఖని, శ్రేయ అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ లు కీలక పాత్రల్లో నటించారు.