మరో మూడు రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక జరుగుతుందనే సంగతి తెలిసిందే. తెరాస, బీజేపీ మధ్య ఊహించని స్థాయిలో పోటీ నెలకొనగా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తెరాసకు ఓటమి తప్పదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే మునుగోడులో ఏ పార్టీ గెలిచినా గెలిచిన పార్టీపై కూడా ఇతర పార్టీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేయడం వల్లే ఆ పార్టీ గెలిచిందని ఇతర పార్టీల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు లెక్కకు మించి ఖర్చు చేయడం గమనార్హం. మునుగోడు ఉపఎన్నికలో గెలిస్తే 2024లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
మరోవైపు తెలంగాణలో అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. రాష్ట్రంలో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వాలని ప్రజలు సైతం భావిస్తున్నారని పలు సర్వేలలో వెల్లడైంది. మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 2,43,594 కాగా మునుగోడు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
మునుగోడు ఉపఎన్నికల ఫలితాలు ఏ విధంగా వస్తాయో చూడాల్సి ఉంది. కోమటిరెడ్డి సోదరులకు నియోజకవర్గంలో ఉన్న అభిమానులు ఆయనను గెలిపిస్తారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బీజేపీకి షిప్ట్ అవుతుందని బీజేపీ ఆశలు పెట్టుకోగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.