టిఆర్ఎస్ తరపున లోక్ సభకు పోటి చేసే అభ్యర్ధుల జాబితాను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వలేమని ఆయన స్సష్టం చేసినట్టు తెలుస్తోంది. అందులో పొంగులేటి శ్రీనివాస్, జితేందర్ రెడ్డి, సీతారం నాయక్ లున్నారు. వారికి టికెట్లు ఇవ్వడం లేదని ఇప్పటికే కేసీఆర్ వారికి చెప్పారని తెలుస్తోంది.
ఖమ్మం ఎంపీగా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటి చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఆ సీటును టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరబోతున్న నామా నాగేశ్వరరావుకు ఇవ్వనున్నట్టు చర్చ జరుగుతోంది. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో అక్కడి నుంచి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేరు ఖరారైంది. మరో వైపు సగం ఎంపీ అభ్యర్దులు ఈ సారి కొత్తవారే ఉండనున్నారని సమాచారం. దీంతో సిట్టింగ్ ఎంపీల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు ఖరారైన పేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి లిస్టును కేసీఆర్ గురువారం సాయంత్రం వరకు విడుదల చేయనున్నారు.
ఆదిలాబాద్- గడ్డం నగేష్
కరీంనగర్- బి. వినోద్ కుమార్
నిజామాబాద్- కవిత
జహీరాబాద్- ప్రశాంత్ పాటిల్
మెదక్- కొత్త ప్రభాకర్ రెడ్డి
భువనగిరి- బూర నర్సయ్య గౌడ్
వరంగల్- పసునూరి దయాకర్
చేవేళ్ల- రంజిత్ రెడ్డి
మల్కాజ్ గిరి- నవీన్ కుమార్
నాగర్ కర్నూల్- పి. రాములు
మహబూబాబాద్- మాలోతు కవిత
సికింద్రాబాద్- తలసాని సాయి కిరణ్
మహబూబ్ నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి