Telangana: తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదు… మేం సాధించాం: కేటీఆర్

Telangana: తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజా ఉద్యమం ద్వారా పోరాటం చేసే ప్రత్యేక తెలంగాణ అని సంపాదించుకున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సందర్భంగా నేడు బిఆర్ఎస్ నేతలు అందరూ కూడా పార్టీ ఆధ్వర్యంలో దీక్ష దివస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా.. తెలంగాణ విజయాన్ని నిర్దేశించిన రోజు అంటూ.. కేసీఆర్ ఫోటోలతో కూడిన పోస్ట్ చేశారు. దీనిపై ఈ రోజు డూ ఆర్ డై పోరు రాజుకొని, తెలంగాణ ఖాయమైన రోజు అని, 15 ఏళ్ల క్రితం కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజని కేటీఆర్ తెలిపారు.అలాగే అతని ఉక్కు సంకల్పం దేశం యొక్క రాజకీయ స్థాపనకు ఒత్తిడి చేసిందని అన్నారు. అంతేగాక తెలంగాణ ఇవ్వలేదు, కాంగ్రెస్‌పై సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ఉద్యమం ద్వారా సాధించినదని తెలిపారు.

ఇలా ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన కేసీఆర్ గురించి ఈయన పోస్ట్ చేయడమే కాకుండా ఇక ప్రతిరోజూ మాకు స్ఫూర్తినిచ్చే మీ నాయకత్వానికి ధన్యవాదాలు కేసీఆర్ సార్.. రాబోయే అనేక తరాల వరకు ఇది అలాగే కొనసాగుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒకవైపు కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో విజయోత్సవ సభలో ఏర్పాటు చేస్తుండగా మరోవైపు టిఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి 15 సంవత్సరాలు పూర్తి కావడంతో దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం తూటాల పేలుతుందని చెప్పాలి.