కేంద్ర మంత్రులకు ఆ విషయం పై లేఖ రాసిన కేటీఆర్ !

పలువురు కేంద్ర మంత్రులకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో పురపాలక శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ది పనులకు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. జీహెచ్‌ఎంసీలో సమగ్ర సివరేజ్‌ మాస్టర్‌ప్లాన్‌ కోసం నిధులు మంజూరు చేయాలని జ్ఞప్తి చేస్తూ కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌పురి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు కేటీఆర్ లేఖ రాశారు.

ministar ktr
 

వ్యూహాత్మక నాలా అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే వరంగల్‌లో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న మెట్రో నియో ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. పురపాలక శాఖ ద్వారా పట్టణాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు.

మున్సిపాలిటిల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్, మానవ వ్యర్ధాల ట్రీట్మెంట్ ప్లాంట్లు, బయో మైనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆమోదించడంతోపాటు కనీసం 20 శాతం నిధులను రానున్న కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని కోరారు.ఇక, కొద్ది రోజులుగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఆయన కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లకు వేర్వేరుగా లేఖలు రాసిన సంగతి తెలిసిందే.