కేసీఆర్ ను వదిలేది లేదు.. రాజగోపాల్ రెడ్డి కామెంట్ల వెనుక అర్థం ఇదేనా?

Komatireddy Rajagopal Reddy

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత తొలిసారి ఒక న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధం చేసే వ్యక్తి గెలుపుఓటముల గురించి మాట్లాడడని జనరల్ ఎలక్షన్స్ సమయంలో కేసీఆర్ మునుగోడుకు ఎంతమందిని తీసుకొస్తాడని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కు దమ్ముందా అంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్లు చేశారు.

మునుగోడులో అంతమందిని పెట్టి కూడా కేవలం పది వేల మెజారిటీ వచ్చిందంటే ఆయన ఓడిపోయినట్టేనని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. దొంగ, గజదొంగ, బందిపోటు, టెర్రరిస్ట్ వేర్పాటు వాది కేసీఆర్ అని ఆయన తెలివి దొంగ తెలివి అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాటల్లో నిజం లేదని అది పాటించనని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ చేసిన స్థాయిలో ఏ పార్టీ అవినీతి చేయలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ఆ ఎమ్మెల్యేలను బీజేపీ ఎందుకు కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అన్న, తమ్ముడు అని కూర్చుంటే పోరాటం ఆగదని ఆయన కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి చరిత్ర బ్లాక్ మెయిల్ చరిత్ర అని ఆయన చెప్పుకొచ్చారు. పది కుక్కలు మొరిగినా నేను పట్టించుకోనని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా జైలుకు పోతుందని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ మోసం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ఓటమి ఫలితం ఆయనను ఏ స్థాయిలో బాధ పెట్టిందో ఈ కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. మునుగోడు ఉపఎన్నికలో ఇప్పుడు ఓటమిపాలైనా 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున గెలుస్తానని రాజగొపాల్ రెడ్డి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.