తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ముందస్తుగా ప్రచారాన్ని షురూ చేశారు టిఆర్ఎస్ అభ్యర్థులు. తమ నియోజవకర్గాల్లో ప్రచారం చేస్తూనే జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే చాలా నియోజకవర్గాల్లో జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో లీడర్లను జనాలు నిలదీస్తున్నారు.
తాజాగా వనపర్తి జిల్లాలోనూ ఇటువంటి పరిణామం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లాలోని చిన్నాంబావి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే మంత్రి జూపల్లి కాన్వాయ్ కి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు స్థానిక రైతులు. కాలువల ద్వారా జూరాల నీరు రావడంలేదని మంత్రిని నిలదీశారు. దీంతో పోలీసులు వారిని చెరదగొట్టారు.
20 ఏడ్ల నుంచి ఏం చేయలేదు ఇప్పుడెందుకు వచ్చారంటూ నిరసన తెలిపారు. ఈ సమయంలో కాన్వాయ్ కి అడ్డుతగిలే ప్రయత్నం చేసిన వారిపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన పాలమూరులో చర్చనీయాంశమైంది.
రైతులు జూపల్లికి రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన 2 వీడియోలు కింద ఉన్నాయి చూడండి.