Munugode By-Poll: మునుగోడు బై పోల్: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెబుతున్నాయంటే.?

Munugode By-Poll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఆరు గంటల వరకు క్యూ లైన్లలో వున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు. మరోపక్క, గత కొద్ది రోజులుగా మునుగోడులో నెలకొన్న హై టెన్షన్ వాతావరణం ఒకింత శాంతపడిందనే చెప్పాలి. పోలింగ్ రోజు కాస్త చెదరుమదరు సంఘటనలు చోటు చేసుకున్నా, పోలింగ్ ప్రశాంతగానే జరిగిందని అధికారులు అంటున్నారు.

కాగా, పోలింగ్ సమయం ముగిశాక ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో, తెలంగాణ రాష్ట్ర సమితిదే గెలుపని తేలుతోంది. సీ-ఓటర్ సర్వే మాత్రం బీజేపీకి మునుగోడు ఓటర్లు పట్టం కట్టినట్లుగా తేలింది. అయితే, ఇవి జస్ట్ అంచనాలు మాత్రమే.

అయితే బీజేపీ.. లేదంటే టీఆర్ఎస్.. అంతే తప్ప, ఎక్కడా కాంగ్రెస్ పార్టీ హంగామా ఎగ్జిట్ పోల్స్‌లో కనిపించడంలేదు. కాంగ్రెస్ పార్టీకి మరీ దారుణంగా 10 నుంచి 20 శాతం ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో.

సి-ఓటర్ సర్వే ప్రకారం బీజేపీకి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి 38 శాతం ఓట్లు వచ్చేట్లుందని సి–టర్ సర్వే పేర్కొంది. అయితే, మిగతా సర్వేలన్నీ దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కడుతున్నాయి.

కొన్ని సర్వేల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి 45 శాతం ఆ పైన ఓట్లు వచ్చే అవకాశం వున్నట్లు కనిపిస్తోంది. ఏ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీని పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడంలేదు. కేఏ పాల్ ప్రభావం అస్సలు లేదుగానీ, బీఎస్పీ ప్రభావం కొతమేర కనిపిస్తోంది.

అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలను మంచి తమకు మంచి మెజార్టీ వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి చెబుతోంటే, మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగలేదనీ.. బీజేపీకి పట్టం కట్టారనీ కమలనాథులు చెబుతున్నారు.