స్టేజి పైకి వెళుతూ కిందపడ్డ టిఆర్ఎస్ ఎంపీ కవిత (వీడియో)

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు హెచ్ ఐసిసిలోని నోవాటెల్ హోటల్ లో జరుగుతుంది. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నా హజారేను తీసుకొని స్టేజి పైకి వెళుతూ  కింద పడ్డారు. దీంతో ఆమెకు స్వల్ప గాయమైనట్టు తెలుస్తోంది. 

శని ఆది వారాలు రెండు రోజులు ఈ  కార్యక్రమం జరుగుతున్నది. వివిధ దేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త అన్నాహజారే కూడా హాజరయ్యారు. కవిత కాలు జారి కింద పడ్డ వీడియో కింద ఉంది చూడండి.