ఆయన టిఆర్ఎస్ పార్టీలో కీలక నేత. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలవలేడు అనుకున్న స్థానంలో గెలిచి చూపించాడు. కానీ పాపం ఆయనకు ఈ మధ్య అనారోగ్య సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. అందరిని షేక్ చేసే వాడిగా పేరున్న ఆయన ఆ ఒత్తిడితో మానసిక ప్రశాంతత కోల్పోయారట. తీవ్ర డిప్రెషన్ తో ఏకంగా కేరళ వెళ్లి చికిత్స చేయించుకొని వచ్చారని సమాచారం. ఇంతకీ ఎవరా నేతా… ఆయనకు ఏమైందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఆయన ఎవరో కాదు ఖైరతాబాద్ నుంచి టిఆర్ఎస్ తరపును ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్. దానం నాగేందర్ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వినిపిస్తున్నాయి. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యతో కేరళ వెళ్లి చికిత్స చేయించుకొని వచ్చారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. మంత్రి పదవిపై దానం నాగేందర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతుండడంతో పదవి వస్తుందో రాదోనని ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఆయన మానసికంగా ఇబ్బంది పడడంతో ఆయనను చికిత్స నిమిత్తం కేరళకు తీసుకెళ్లారంట. ఆయనకు అడుగులు తడబడి, మాట వంకరపోయిందంట. దీంతో కేరళలో చికిత్స చేయంచుకోని ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారని తెలుస్తోంది.
పిజెఆర్ శిష్యునిగా దానం నాగేందర్ రాజకీయ ప్రవేశం చేశారు. ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ హయాంలో కీలక నేతగా ఎదిగాడు. మంత్రిగా పని చేశారు. 2014 లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావడంతో పార్టీకి దూరమయ్యాడు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు. 2014 లోనే దానం టిఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరిగింది కానీ పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి కీలకంగా ఉండడంతో ఆయన అప్పుడు పార్టీలో చేరలేకపోయారని తెలుస్తోంది.
ఎట్టకేలకు 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరి చివరి వరకు కూడా సీటు కేటాయింపు కాకపోయినా చివరకు తనకే సీటు దక్కేలా దానం చక్రం తిప్పాడు. టిఆర్ఎస్ పార్టీకే నమ్మకం లేని స్థానంలో గెలిచి తన సత్తా చాటాడు. కానీ మంత్రి పదవి పై బెంగతో ఆయన మానసిక క్షోభకు గురికావడం చర్చనీయాంశమైంది.