ఒకప్పటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు. తెలంగాణకు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో అని అంతా అనుకున్న రోజుల నుంచి.. కేసీఆర్ వల్ల ఇప్పుడు తెలంగాణ ఏమైపోతుందో అన్న భయం ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం. ఒక్కోసారి సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవడం.. తర్వాత వాటిని వెనక్కి తీసుకోవడం లాంటి ఎన్నో నిర్ణయాలను మనం చూశాం. చూస్తూనే ఉన్నాం.
సీఎం కేసీఆర్ ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో మంచి సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అందులో నో డౌట్. కానీ.. ఎల్ఆర్ఎస్, నిర్బంధ పంటలు లాంటి నిర్ణయాలు.. తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి.
వాటికి ప్రతిఫలమే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు. అందుకే సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. పోయిన ఫేమ్ ను మళ్లీ సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. 2023 లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటే.. ఖచ్చితంగా ఇక నుంచి ప్రజలతో మమేకం అవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట.
త్వరలో వరంగల్, ఖమ్మంలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఇప్పటికైనా తేరుకొని ఆయా జిల్లాల పర్యటన చేయకపోతే.. దుబ్బాక ఫలితమే వస్తుందని తెగ టెన్షన్ పడుతున్నారట సీఎం కేసీఆర్. అందుకే ఎలాగైనా ఆ జిల్లాల పర్యటనకు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.
ప్రస్తుతానికి ఈ రెండు జిల్లాల మీదనే సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారట. ఖమ్మం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించే అవకాశం ఉందట. ఆయా జిల్లాల్లో పర్యటించినప్పుడు అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై వ్యూహాలు రచిస్తారట.
మొత్తం మీద సీఎం కేసీఆర్ వచ్చే ఏ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోకూడదని బాగానే ప్లాన్లు వేస్తున్నారు. ఈ ప్లాన్లు అయినా వర్కవుట్ అవుతాయో లేదో చూద్దాం మరి.