వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కు షాక్ తప్పదా.. బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Rally-Bharatiya-Janata-Party-BJP-Narendra-Modi-India-April-2019

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీకే విజయం దక్కుతుందని టీ.ఆర్.ఎస్ భావిస్తోంది. పార్టీ పేరు బీ.ఆర్.ఎస్ గా మారినా టీ.ఆర్.ఎస్ పేరు కలిసొచ్చిన స్థాయిలో బీ.ఆర్.ఎస్ పేరు కలిసిరాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కు షాక్ తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సిరిసిల్లలో కేటీఆర్ కు ఓటమి తప్పదని చెప్పుకొచ్చారు.

మీడియా ముందు ధర్మపురి అర్వింద్ ఘాటు విమర్శలు చేశారు. ఇందూరుకు కేటీఆర్ ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రభుత్వం కమీషన్లు తినిందని ఆ కారణం వల్లే పూర్తిస్థాయి వివరాలతో కూడిన ప్రాజెక్ట్ ఇవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదని ఆయన తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే బీజేపీ బలమైన అభ్యర్థులను నిలబెడితే మాత్రమే పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బీజేపీ తెలంగాణ అభివృద్ధి కోసం భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తూ ప్రజలకు దగ్గరవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.