అదిరిపోయే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్.. దీని ప్రయోజనం ఏమిటంటే?

ఇన్‌స్టాంట్‌ ​ మెసేజింగ్ యాప్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా మారిపోయింది. ప్రతిరోజు వాట్సప్ ద్వారా ఎన్నో ఇంపార్టెంట్ మెసేజ్లు ఫైల్స్ ను సెండ్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది వారి వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చే మెసేజ్ ల ద్వారా ఎంతో విసుగు చెందతో ఉంటారు .అయితే ఇలా విసుకు చెందే వారి కోసం వాట్సాప్ అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ ఫీచర్
డెస్క్‌టాప్‌ యూజర్లకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి రానుంది.

మ్యూట్ షార్ట్‌కట్‌ ​ అనే కొత్త ఆప్షన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ లేటెస్ట్ ఫీచర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.మ్యూట్‌ షార్ట్‌కట్‌ ఫీచర్‌ను మొబైల్​ వెర్షన్​ యూజర్లకు వాట్సాప్‌ పరిచయం చేయనున్నారు అనంతరం డెస్క్ టాప్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.. ఈ క్రమంలోనే డెస్క్ టాప్ యాప్ లో గ్రూప్ కోసం మ్యూట్ షార్ట్ కట్ అనే ఆప్షన్ అమలులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మనం మ్యూట్లో పెట్టిన గ్రూప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్లను నిలిపివేయడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది.

ఇకపోతే ఒక వాట్సాప్ గ్రూప్లో దాదాపు 1000 మందికి పైగా కాంటాక్ట్ యాడ్ అవ్వచ్చు అయితే ఇలా ప్రతిసారి మెసేజ్ రాగానే చాలామంది వాటిని చూసుకోవడానికి ఎంతో అసహనం వ్యక్తం చేస్తుంటారు అయితే ఇకపై ఇలాంటి సమయం వృధా కాకుండా ఉండడం కోసం వాట్సాప్ ఈ తరహా ఫీచర్ ను అమలులోకి తీసుకువస్తుంది.త్వరలోనే వాట్సాప్ తన డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం ‘కాల్స్ ట్యాబ్‌’ను కూడా యాడ్​ చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్​ బీటా వెర్షన్‌ టెస్టింగ్ దశలో ఉంది. ఇలా సరికొత్త ఫీచర్స్ ద్వారా వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తుంది.