తాజాగా వాట్సాప్ సంస్థ తెచ్చిన కొత్త వ్యక్తిగత గోప్యతా విధానంపై మొదలైన వివాదం వలన యూజర్లు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ప్రత్యామ్న్యాయ యాప్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనితో దాని ప్రత్యర్థుల యాప్స్ కి వరంగా మారింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో సిగ్నల్, టెలిగ్రాంల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయి.
ఈ నెల 5 నుంచి 12 మధ్య గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి కోటి 78 లక్షల మంది సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అంతకు ముందు వారంలో 2 లక్షల 85 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. సిగ్నల్ తరహాలోనే టెలిగ్రాం యాప్‌కి సైతం గిరాకీ పెరిగింది. ఈ నెల 5 నుంచి 12 మధ్య కోటి 57 లక్షల మంది టెలిగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అంతకు ముందు వారం 77 లక్షల డౌన్‌లోడ్లతో పోలిస్తే ఇది రెట్టింపు.
మరోవైపు… వివాదంలో చిక్కుకున్న వాట్స్‌యాప్‌ను వినియోగించే వాళ్ల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతోంది. ఈ నెల 5 నుంచి 12 మధ్య కోటి డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. అంతుకు ముందు వారం కోటి 27 లక్షల డౌన్‌లోడ్లు జరగ్గా… వివాదం మొదలయ్యాయక 20 లక్షల డౌన్‌లోడ్లు తగ్గాయి. పరిస్థితిని చూస్తుంటే వినియోగదారులు ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. త్వరలో వాట్సాప్ వినియోగదారులు అతి తక్కువ మంది మాత్రమే ఉంటారని, పతనం ప్రారంభమైందని టెక్ పండితులు అంటున్నారు.