యూట్యూబర్లకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్… అలాంటి వీడియోలు చేస్తే శిక్ష తప్పదు!

central government permission required for create anew channel in youtubea

ప్రస్తుత కాలంలో పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంతోమంది చాలా సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు ముఖ్యంగా చాలామంది సినిమా సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ ప్రజల వరకు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి ఎన్నో వీడియోలను తమ యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అల్లరిస్తున్నారు అదే విధంగా తమ యూట్యూబ్ ద్వారా కొన్ని ప్రమోషనల్ వీడియోలను కూడా చేస్తున్నారు.అయితే చాలా యూట్యూబ్ ఛానల్ తప్పుడు సమాచారాలను ప్రసారం చేస్తుండడంతో ఇలాంటి యూట్యూబ్ ఛానల్ భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ క్రమంలోనే ఈమధ్య ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో(పీఐబీ) ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోన్న మరో 3 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఆ ఛానెల్స్ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేసే ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో ఈ యూట్యూబ్ ఛానల్ ను బ్లాక్ చేశారు.

ఈ యూట్యూబ్ ఛానెల్స్ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు(EVMలు) ఇంకా అలాగే వ్యవసాయ రుణాల మాఫీ వంటి వాటిపై తప్పుడు సమాచారాలను అందించడమే కాకుండా వివాదాస్పద భరితమైన వార్తలను సృష్టిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ వారు పెట్టే ఫేక్ లోగోలు, అసహ్యంగా వుండే థంబ్‌నెయిల్స్ పెట్టి వ్యూయర్స్ ను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో పలు యూట్యూబ్ ఛానల్ పై నిగా పెట్టింది ఈ క్రమంలోనే ఇకపై ఎవరైతే తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచారం చేస్తుంటారు అలాంటి వారు భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలుస్తుంది.