ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క యూజర్ కూడా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఈ క్రమంలోనే వాట్సాప్ సైతం యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.ఈ క్రమంలోనే నిత్యం వాట్సాప్ చాటింగ్లు మెసేజ్ల ద్వారా ఎన్నో అనవసరమైనటువంటి ఫైల్స్ మన ఫోన్లో స్టోరేజ్ అవుతూ ఉంటాయి.ఇలా ఫోన్లో అనవసరమైన ఫైల్స్ ఉండటం వల్ల ఫోన్ పై అధిక భారం పడటమే కాకుండా ఫోన్ స్లో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ విధంగా అన్ వాంటెడ్ ఫైల్స్ ఫొటోస్ వీడియోస్ తొలగించాలంటే చాలామంది ప్రతి ఒక్క ఫైల్ ఓపెన్ చేసి అనవసరమైనటువంటి ఫైల్స్ తొలగిస్తూ ఉంటారు. అయితే ఎలాంటి కష్టం లేకుండా ఈ అనవసరమైనటువంటి ఫైల్స్ ను చాలా సులభంగా డిలీట్ చేసుకోవచ్చు. మరి ఈ పైల్స్ ను ఎలా డిలీట్ చేయాలి అనే విషయానికి వస్తే… ముందుగా వాట్స్అప్ ఓపెన్ చేసి కుడివైపు కనిపించే మూడు చుక్కలపై ప్రెస్ చేయాలి. ఇందులో సెట్టింగ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకొని అందులో స్టోరేజ్ మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ కు వెళ్లాలి. అప్పుడు వాట్సాప్ ఫైల్స్ డేటా (ఫోన్ మెమొరీ) కనిపిస్తుంటుంది. అక్కడ కనిపించే లార్జర్ దెన్ 5 ఎంబీ ఫైల్స్ ను క్లిక్ చేయాలి.
ఈ విధంగా క్లిక్ చేయడం వల్ల అక్కడ ఉండే పెద్ద సైజు ఫైల్స్ లో అవసరం లేని వాటిని సెలక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు అదే విధంగా పక్కనే కాంటాక్ట్ లిస్ట్ కూడా ఉంటుంది. కాంటాక్ట్ వారీగా మీడియా ఫైల్స్ చూసి డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత, ఫోన్ స్టోరేజీని ఓ సారి పరిశీలించుకుని అక్కడ కూడా అన్ వాంటెడ్ ఫైల్స్ కనిపిస్తే డిలీట్ చేసుకోవడం వల్ల మన ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉంటుంది.