దేశవ్యాప్తంగా కులమత బేధాలు లేకుండా ప్రజలందరూ దీపావళి పండుగ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ అమావాస్య రోజున మట్టి దీపాలు వెలిగించి చీకటిని పారద్రోలుతూ వెలుగు నింపే ఈ పండగ ప్రజలలో చెడుని తొలగించి మంచిని ప్రేరేపిస్తుందని నమ్మకం. దీపావళి పండుగ రోజున లక్ష్మి దేవికి పూజ నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించడానికి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా అందంగా కూడా అలంకరించుకోవాలి.
అలంకార ప్రియురాలైన లక్ష్మీదేవి దీపావళి పండుగ రోజున మన ఇంట్లోకి ప్రవేశించడానికి ముందు ఆ దేవికి ఇష్టమైన ముగ్గులు వేయాలి. దీపావళి పండుగ రోజున ఇంటి ముఖ ద్వారం ముందు ఇలాంటి ముగ్గులు వేయాలో తెలుసుకుందాం.
దీపావళి పండక్కి ఇంటిని శుభ్రం చేసుకుని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందువల్ల ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక దీపావళి పండుగ రోజున ఇంటి ముఖ ద్వారం ముందు కల్లాపి చెల్లి రంగురంగుల ముగ్గులతో లోగిలి అందంగా తయారు చేయాలి.అలాగే పూజ గదిలో కూడా రంగురంగుల ముగ్గులతో పువ్వులతో పూజ గదిని చక్కగా అలంకరించుకోవాలి.
లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులను పూజలో సమర్పించి ఆ దేవుని పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఏడాది పాటు సిరి సంపదలు చేకూరుతాయని నమ్మకం. అంతేకాకుండా ఇంటి ముఖద్వారం వద్ద కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన ఆ తామర పువ్వు ముగ్గులు వేసి రంగులతో, పువ్వులతో ముగ్గును బాగా అలంకరించాలి. ఇలా తామర పువ్వులతో ముగ్గు వేసి అందంగా అలంకరించిన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేసించి ఇంట్లో కొలువై ఉంటుందని ప్రజల నమ్మకం.