2025లో దీపావళి కొన్ని రాశుల వారికి మరింత ప్రత్యేకంగా మారబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 20న జరగబోయే ఈ పండుగ రోజు సుదీర్ఘకాలం తర్వాత.. అంటే దాదాపు 800 సంవత్సరాల తర్వాత, అరుదైన గ్రహ స్థితులు ఏర్పడబోతున్నాయని చెబుతున్నారు. దీపాల పండుగ కాంతులతో దేశం నిండిపోతున్న సమయంలో.. ఆకాశంలో ఐదు రాజయోగాలు.. సుక్రాదిత్య యోగం, హంస మహాపురుష యోగం, నీచ్‌బంగ్ రాజయోగం, నవపంచ రాజయోగం, కాలకృతి రాజయోగం.. ఒకేసారి కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ గ్రహ స్థితులు కొన్ని రాశుల వారికి ఆర్థిక, వృత్తి, కుటుంబ, మానసిక పరంగా విశేష శుభఫలితాలను అందించబోతున్నాయంట.
దీపావళి సమయంలో సంభవించే ఈ గ్రహ మార్పు ధన లక్ష్మీదేవి కటాక్షాన్ని పలు రాశులపై కురిపించబోతుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా మిథున, కర్కాటక, తులా, మకర రాశుల వారికి ఈ యోగాలు అదృష్ట ద్వారాలు తెరవనున్నాయని జ్యోతిష్య నిపుణుల అంచనా. మిథున రాశివారికి ఈ దీపావళి నిజమైన కొత్త ప్రారంభానికి దారి తీస్తుంది. రెండవ ఇంట్లో ఏర్పడే హనస రాజయోగం దాంపత్య జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. 5వ ఇంట్లో సుక్రాదిత్య యోగం ఉద్యోగం, వ్యాపారం వంటి వృత్తి రంగాల్లో అద్భుతమైన అవకాశాలను తెస్తుంది. అదే సమయంలో 4వ ఇంట్లో ఏర్పడే కాలకృతి యోగం మానసిక సంతృప్తి, కుటుంబ సమాధానాన్ని అందిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపిస్తాయి. ఆర్థికంగా స్థిరపడే సమయం ప్రారంభమవుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వృత్తిలో కొత్త స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి.
కర్కాటక రాశివారికి లగ్నంలో సంభవించే ఈ యోగాలు ప్రతిష్ఠ, గౌరవం తెస్తాయి. రెండవ ఇంట్లో కాలకృతి యోగం వృత్తిలో ఉన్నతస్థానాలకు దారితీస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో లాభాలు సాధించే సమయం ఇది. పెట్టుబడులు సానుకూల ఫలితాలు ఇస్తాయి. మానసికంగా గత కాలం నాటి ఒత్తిడి తొలగిపోతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి.
ఇక తులారాశి వారికి ఈ దీపావళి గోల్డెన్ ఛాన్స్‌లా మారే అవకాశం ఉంది. లగ్నంలో శుక్రాదిత్య యోగం, కర్మభావనలో హంసరాజయోగం ఏర్పడడం వల్ల పదోన్నతి, ఉద్యోగ మార్పు లేదా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి బదిలీలు లేదా ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. పాత పెట్టుబడులు లాభాల రూపంలో తిరిగి వస్తాయి. ఆర్థికంగా కొత్త స్థిరత్వం లభిస్తుంది.
మకర రాశివారికి 9వ ఇంట్లో ఏర్పడే ఈ అరుదైన గ్రహ స్థితులు కోరికలను నెరవేర్చే సమయం. ప్రయాణాలు, కొత్త అవకాశాలు, వ్యక్తిగత ఆశయాల సాధనకు ఇది శుభ సమయం. కాలకృతి యోగం, కర్మ యోగం కలిసిన ఈ సంయోగం వివాహ జీవితంలో ఆనందాన్ని, ప్రేమ జీవితంలో కొత్త మలుపులను తెస్తుంది. సాహస యాత్రలు, కొత్త మార్గాల్లో అడుగుపెట్టే ధైర్యం కలుగుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు, మద్దతు లభిస్తాయి.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం, దీపావళి పండుగ కాంతులు వెలిగే ఈ రోజు కేవలం పండుగ మాత్రమే కాకుండా, జీవితంలో కొత్త దిశలు తెరవబోయే శుభ సమయమని భావించవచ్చు. ఈ రోజున దీపాలు వెలిగించడం, పూజలు చేయడం, శుభసంకల్పాలు చేయడం వలన ఆధ్యాత్మిక శక్తులు బలపడతాయని విశ్వాసం ఉంది. గ్రహ స్థితులు అనుకూలంగా ఉన్న వారికి ఆర్థిక, వృత్తి, కుటుంబ జీవితాల్లో శుభ ఫలితాలు లభిస్తాయని నిపుణుల అభిప్రాయం. (గమనిక: ఈ కథనం నిపుణుల అభిప్రాయం ప్రకారం మాత్రమే రాసినది. దీనిని న్యూస్ 18 తెలుగు ధృవీకరించడం లేదు.)
