కుటుంబ సభ్యుల సమక్షంలో నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ వివాహం కాసేటి క్రితమే మిథున లగ్నంలో వేద పండితులు నిర్ణయించిన ముహూర్తంలో అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో చైతన్య, నిహారిక మెడలో మూడు ముళ్లు వేశారు. నిహారిక ఎరుపు రంగు చీరలో పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. నిహారిక-చైతన్య పెళ్లి వేడుకలకు ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది అతిథులు హాజరయ్యారు. ఇప్పటికే నిహారిక పెళ్లిలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేసారు. మరోవైపు నిహారిక పెళ్లిలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్, కూతురు ఆద్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
The moment #ChaitanyaJonnalagadda & #NiharikaKonidela tied the knot 🥰✨#Niharika #ChaitanyaJV #Tollywood #NiharikaWedding #MrsNiha #MegaFamily #NisChayWedding #NisChay pic.twitter.com/wGRm66cjam
— Hyderabad Times (@HydTimes) December 9, 2020
తన కూతురిని అత్తారింటికి సాగనంపే సమయం దగ్గర అవటంతో పాత జ్ఞాపకాలు తలచుకుంటూ నాగబాబు ఉద్వేగానికి గురయ్యారు. ‘‘సరికొత్త జీవితం ఆరంభించబోతున్న నీకు శుభాకాంక్షలు. తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. అప్పుడైతే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. తనతో ఇరవై నాలుగు గంటలు ఆడుకోలేననే బాధ వెంటాడేది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది.. నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా నిహా తల్లి’’ అంటూ నటుడు నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. తన గారాలపట్టి నిహారిక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను మెగా బ్రదర్ బుధవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు.