సినిమా అవకాశాలు రావాలంటే ఆ పని చేయాల్సిందే అని కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ!

విష్ణు ప్రియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పోవే పోరా ప్రోగ్రాం యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియా మోడలింగ్ రంగం ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. విష్ణు ప్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ ఫిగర్ తో ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తుంది.

ఈ భామకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అడపాదడపా సినిమా అవకాశాలతో ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఎమోషనల్ గా మాట్లాడినా మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోజురోజుకు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ విపరీతంగా పెరుగుతుందని పేర్కొనడం జరిగింది.

ఒకప్పుడు తాను సినిమా అవకాశం వస్తే చాలు అనుకుని సినిమాలో ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేదానినని దాని ప్రభావం వల్ల కాస్త అవకాశాలు కూడా తగ్గాయంటూ పేర్కొంటూ, ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా అవకాశం కావాలంటే దాని గురించి చర్చించే ప్లేస్ వేరే ఉందని పరోక్షంగా అడగడం వల్లే చాలామంది తెలుగు అమ్మాయిలు తెర వెనకే ఉన్నారు.

ముందుకు రాలేకపోతున్నారు అని కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది. ఇలాంటి పద్ధతులు మారితే కానీ ఇండస్ట్రీలో ఆడవాళ్లకు రక్షణ ఉండదు. సినిమా అవకాశాల కోసం ఇలా దారుణంగా ఎదుటివారిని వాడుకోవాలి అనుకునేవారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు అంటూ వాపోయింది.

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా కనిపించక పోవడానికి ఇదే ఒక ముఖ్యం కారణంగా పేర్కొనడం జరిగింది. ఇక తనను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని ఎప్పటికప్పుడు డాన్స్ తో దుమ్ము లేపి ఆ వీడియోలను సోషల్ మీడియాతో పంచుకుంటూ ఉంటుంది. ఎవరు తనను ట్రోల్ చేసిన, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసిన తనేంటో తనకు తెలుసని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.