ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 13 వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ షో మరి కొద్ది రోజులలో ముగియబోతుంది. 13వ వారం నామినేషన్ లో ఎనిమిది మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో శనివారం ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు.
ఆ తరువాత తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్న పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చేసాడు.ఆదివారం రోజున నాగార్జున హౌస్ మేట్స్ తో సరదాగా ఆటలు పాటలతో సందడి చేశారు. ఆతర్వాత ఎలిమినేషన్ లో ఉన్న పృథ్వీ, విష్ణు యాక్షన్ రూమ్‌కి వచ్చేయండి అని నాగార్జున పిలిచారు. అక్కడ ఇద్దరి ముందు రెండు అక్వేరియంలు పెట్టారు. అలాగే రెండు లిక్విడ్ బాటిల్స్ కూడా ఇచ్చారు. నెంబర్ వన్ అన్ని రాసి ఉన్న లిక్విడ్ బాటిల్ ని తమ ఎదురుగా ఉన్న ఎక్వేరియంలో వేయమన్నారు నాగార్జున.
విష్ణు ప్రియ, పృద్వి ఇద్దరూ అలాగే చేశారు. వాటర్ ఎల్లో కలర్ లోకి చేంజ్ అయింది. ఇప్పుడు నెంబర్ టు అని రాసి ఉన్న లిక్విడ్ బాటిల్ని అక్వేరియంలో వేయమన్నారు నాగార్జున. ఎవరి ఎక్వేరియం రెడ్ కలర్ లోకి మారితే వారు ఎలిమినేట్ అయినట్లు అని చెప్పారు. ఈ క్రమంలో పృద్వి అక్వేరియం రెడ్ కలర్ గా మారిపోగా విష్ణు ప్రియ ఎక్వేరియం మాత్రం ఎల్లో కలర్ లోనే ఉంది.
దీంతో పృద్వి ఎలిమినేట్ అయిపోయాడు. అందరికీ వీడ్కోలు చెప్పి బయటికి వచ్చేసాడు పృద్వి. విష్ణు మాత్రం అతనికి ఒక కిస్ కూడా ఇచ్చి సెండ్ ఆఫ్ చెప్పింది. అలాగే తనని ఆటలో గెలిపించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంది విష్ణు ప్రియ. బయటికి వచ్చిన తర్వాత పృథ్వి కి తన వీడియో జర్నీ ప్లే చేసి చూపించాడు నాగార్జున. అందులో తన తల్లిదండ్రుల వీడియోలని చూసి ఎమోషనల్ అయ్యాడు పృథ్వి.