విశ్వనగరమా? విశ్వనరకమా? హైదరాబాద్ పేరుకే మహానగరం. సాధారణ రోజుల్లో ఎంతో అద్భుతమైన నగరమంటూ నాయకులు ప్రగల్భాలు పలికిన ఈ నగరం ప్రస్తుతం ప్రజలకు నరకంలా కనిపిస్తోంది. బంగారు తెలంగాణ అంటూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు 30 మంది అమాయకుల ప్రాణాలు పోయాయి. లెక్కలోకి రాని మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని తెలుస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఎంతలా అభివృద్ధి చేసిందో కొన్ని గంటల వర్షానికే ప్రజలకు అర్థమైంది.
నగరంలోని రోడ్లపై అడుగుపెడితే ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆరేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయని ప్రజలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అభివృద్ధి చేశాం అంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్, కేటీఆర్ ఏ రేంజ్ లో అభివృద్ధి చేశారన్నది ఇప్పుడు కళ్లకు కట్టినట్టు ప్రజలకు కనిపిస్తోంది. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ నగరవాసులు కాలు బయటకు పెట్టలేని పరిస్థితి నెలకొంది.
ఎంతో ప్రశాంతంగా ఉండే హుస్సేన్ సాగర్ నిండిపోయి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణను సాధించి కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారు అంటూ కొందరు ప్రజలు ప్రశ్నిస్తే మరికొందరు ఇలాంటి ప్రభుత్వంలో బ్రతుకుతున్నాం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
[poll id=”10″]